మహీ.. క్రిస్మస్ సంబరాలు ధోనీతో కృతీ సనన్
ABN, Publish Date - Dec 26 , 2024 | 05:44 AM
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ క్రిస్మస్ సంబరాలను వినూత్నంగా జరుపుకొన్నాడు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సంబరాలు చేసుకున్న మహీ.. తన కుమార్తె జివా కోసం శాంటాక్లాజ్ వేషం...
ముంబై: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ క్రిస్మస్ సంబరాలను వినూత్నంగా జరుపుకొన్నాడు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సంబరాలు చేసుకున్న మహీ.. తన కుమార్తె జివా కోసం శాంటాక్లాజ్ వేషం ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఈ వేడుకల్లో బాలీవుడ్ నటి కృతీ సనన్ తదితరులు పాల్గొని సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ధోనీ భార్య సాక్షీ సింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి. క్రిస్మస్ తాత వేషధారణలో ఉన్న ధోనీని చూసి అతని అభిమానులు మురిసిపోతున్నారు. ఆ ఫొటోలకు లైక్‌ల మీద లైక్‌లు కొడుతూ..కామెంట్లు పెడుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
Updated Date - Dec 26 , 2024 | 05:44 AM