Manav Suthar: కొడుకు బ్యాట్స్‌మెన్ కావాలనుకున్నాడు.. కానీ బౌలర్ అయ్యి 7 మైడిన్లు, 7 వికెట్లు తీసి రికార్డు
ABN, Publish Date - Sep 07 , 2024 | 05:26 PM
దులీప్ ట్రోఫీలో ఇండియా సీ తరపున ఆడుతున్న లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాడు. ఎందుకంటే ఒకే మ్యాచులో ఏకంగా 7 మైడిన్ ఓవర్లు బౌలింగ్ చేసి, 7 వికెట్లు పడగొట్టాడు. అయితే సుతార్ తండ్రి మొదట తనను బ్యాట్స్‌మెన్‌గా మార్చాలని కోరుకోవడం విశేషం.
దులీప్ ట్రోఫీ(Duleep Trophy)లో టీమ్ ఇండియాలోని చాలా మంది కీలక ఆటగాళ్ల ప్రదర్శన నిరాశపరిచింది. అయితే మంచి విషయం ఏమిటంటే ఈ వేదికపై తమ ప్రతిభను నిరూపించుకున్న కొంతమంది తెలియని ఆటగాళ్లు కూడా వెలుగులోకి వచ్చారు. వారిలో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్(Manav Suthar) ఇండియా డిపై అద్భుతంగా బౌలింగ్ చేసి 7 వికెట్లు పడగొట్టాడు. మానవ్ సుతార్ స్పిన్‌కు భారత్ డీ బ్యాట్స్‌మెన్స్ పెద్దగా నిలవలేకపోయారు.
ఇండియా సీపై రెండో ఇన్నింగ్స్‌లో ఇండియా డీ 236 పరుగులు చేసింది. ఆ క్రమంలో ఈ జట్టును ఎక్కువగా కట్టడి చేసిం మానవ్ సుతార్ మాత్రమే. మానవ్ సుతార్ 19.1 ఓవర్లలో 49 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ సమయంలో ఆయన 7 ఓవర్లు మెయిడెన్ చేశాడు.
అనుకున్నదొకటి..
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మానవ్ సుతార్ తండ్రి తన కుమారుడు బ్యాట్స్‌మెన్ కావాలని కోరుకున్నాడు. కానీ సుతార్ మాత్రం బౌలర్ అయ్యి అద్భుతంగా బౌలింగ్ వేసి ఆకట్టుకున్నాడు. మానవ్ సుతార్ రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లోని క్రికెట్ కోచింగ్ క్లబ్ నుంచి తన క్రికెట్ కెరీర్‌ను ప్రారంభించాడు. మానవ్ తండ్రి జగదీష్ సుతార్ అతనికి అకాడమీలో ప్రవేశం కల్పించాడు. ఆ క్రమంలో తన కొడుకును మంచి బ్యాట్స్‌మెన్‌గా మార్చాలనుకుంటున్నట్లు కోచ్ ధీరజ్ శర్మతో చెప్పాడు.
రెండు రోజుల పాటు
కానీ చివరకు అందుకు విరుద్ధంగా జరిగింది. ధీరజ్ శర్మ మానవ్ సుతార్ ఆటను రెండు రోజుల పాటు చూశాడు. ఆ క్రమంలో మానవ్ బ్యాట్స్‌మెన్ కోసం కాదు. బౌలింగ్ కోసమని అర్థమైంది. ఈ నేపథ్యంలో సుతార్ దేశీయ క్రికెట్‌లో మంచి పేరు సంపాదించాడు. మానవ్ సుతార్ ఇప్పటివరకు 14 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 65 వికెట్లు పడగొట్టాడు.
8 వికెట్లు తీశాడు
దులీప్ ట్రోఫీలో భారత్ డిపై మానవ్ సుతార్ మొత్తం 8 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్, రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో సుతార్ శ్రీకర్ భారత్‌ను రెండుసార్లు ఔట్ చేశాడు. దీంతో పాటు దేవదత్ పడిక్కల్, రికీ భుయ్, అక్షర్ పటేల్ వంటి దిగ్గజ ఆటగాళ్ల వికెట్లను కూడా తీశాడు. ఈ క్రమంలో త్వరలో ఈ ఆటగాడు టీమ్ ఇండియా టెస్ట్ క్రికెట్‌లో ఆడతాడని క్రీడా వర్గాలు అంటున్నాయి. మానవ్ సుతార్ ఐపీఎల్‌లో ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. ఆయన గుజరాత్ టైటాన్స్ జట్టులో సభ్యుడు. ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడే అవకాశం లభించినా. ఈ ఆటగాడికి త్వరలో మరిన్ని అవకాశాలు లభిస్తాయని అంటున్నారు.
ఇవి కూడా చదవండి..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Sep 07 , 2024 | 05:30 PM