ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Paris Olympics 2024: పారిస్ ఒలంపిక్స్‌లో భారత్ బోణీ.. తొలి ఇండియన్‌గా రికార్డ్

ABN, Publish Date - Jul 28 , 2024 | 04:40 PM

పారిస్ ఒలంపిక్స్ 2024లో భారత్ ఎట్టకేలకు ఖాతా తెరిచింది. ఈ విశ్వ క్రీడలు ప్రారంభమైన మూడో రోజున ఓ కాంస్య పతకం భారత్ తన ఖాతాలో వేసుకుంది. ఈ మెడల్‌ను..

Paris Olympics 2024

పారిస్ ఒలంపిక్స్ 2024లో భారత్ ఎట్టకేలకు ఖాతా తెరిచింది. ఈ విశ్వ క్రీడలు ప్రారంభమైన మూడో రోజున ఓ కాంస్య పతకం భారత్ తన ఖాతాలో వేసుకుంది. ఈ మెడల్‌ను భారత షూటర్ మను భాకర్ (Manu Bhaker) అందించడంతో.. యావత్ భారతావని సంబరాలు మునిగితేలుతోంది. ఆదివారం చటీరోక్స్ షూటింగ్ సెంటర్ వేదికగా జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్‌లో ఆమె మూడో స్థానంలో నిలిచి, కాంస్య పతకం సొంతం చేసుకుంది. దీంతో.. షూటింగ్ విభాగంలో తొలి మెడల్ సాధించిన మొదటి మహిళా షూటర్‌గా మను చరిత్ర సృష్టించింది. ఫైనల్‌లో మను బాకర్‌ 221.7 పాయింట్లతో మూడో స్థానంలో నిలవగా.. దక్షిణ కొరియా షూటర్లు ఓహ్ యే జిన్ (243.2 పాయింట్లు) స్వర్ణం, కిమ్‌ యేజే (241.3 పాయింట్లు) రజతం గెలిచారు.


కాంస్య పతకం గెలిచిన తర్వాత మను భాకర్ మాట్లాడుతూ.. ‘‘ఈ పతకం భారత్‌కు ఎప్పుడో రావాల్సింది. చాలాకాలం నిరీక్షణ తర్వాత ఈ పతకం మన దేశానికి అందింది. ఈ క్రీడల్లో భారత్ మరిన్ని పతకాలు సాధించాలని నేను కోరకుంటున్నా. ఈసారి వీలైనన్ని ఎక్కువ పతకాలు గెలవడం కోసం మేము ఎదురుచూస్తున్నాం. కాంస్య పతకం గెలిచినందుకు నాకెంతో సంతోషంగా ఉంది. నా ఆనందాన్ని మాటల్లో వర్ణించలేకపోతున్నా. ఆఖరి షాట్‌ వరకు కూడా నేను పూర్తి స్థాయిలో పోరాడాను. ఇప్పుడు కాంస్యం గెలిచాను, భవిష్యత్తులో మరింత మెరుగ్గా రాణించాలని అనుకుంటున్నాను’’ అంటూ చెప్పుకొచ్చింది. తాను తరచూ భగవద్గీత చదువుతానని, అదే తన లక్ష్యంపై దృష్టి సారించేలా తోడ్పడిందని మను భాకర్ పేర్కొంది. ఇతర ఆటగాళ్లు కూడా ఈ క్రీడల్లో పతకాలు గెలవాలని కోరుతున్నానని వెల్లడించింది.


ఎవరు ఈ మను భాకర్?

మను భాకర్ హర్యానాకు చెందిన 22 ఏళ్ల యువతి. ఆమె తండ్రి మెరైన్ ఇంజినీర్ కాగా.. ఆమె తల్లి ఓ ప్రిన్సిపల్. మనుకి చిన్నప్పటి నుంచే క్రీడలంటే ఎంతో ఇష్టం. మమెలోని ఈ అభిరుచిని గుర్తించిన తల్లిదండ్రులు.. ఆమెకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. షూటింగ్‌లో తనకు ఎక్కువ మక్కువ ఉండటంతో.. దానిపైనే పూర్తి ఫోకస్ పెట్టింది. 2017లో కేరళలో జరిగిన నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో మను ఏకంగా 9 బంగారు పతకాలను సాధించింది. ఆ తర్వాత 2018లో జరిగిన కామన్‌వెల్త్ గేమ్స్‌లో 16 ఏళ్ల వయసులోనే గోల్డ్ మెడల్ గెలుపొందింది. ఇప్పుడు ఒలంపిక్స్‌లోనూ సత్తా చాటి, సరికొత్త చరిత్రకు పునాది వేసింది.

Updated Date - Jul 28 , 2024 | 05:12 PM

Advertising
Advertising
<