ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

దరఖాస్తులో తప్పులు దొర్లాయేమో!

ABN, Publish Date - Dec 25 , 2024 | 04:18 AM

జాతీయ క్రీడా అవార్డుల సిఫారసుల్లో ఏస్‌ షూటర్‌ మను భాకర్‌ పేరు లేకపోవడం వివాదాస్పదమైంది. పారిస్‌ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన మనును ఈసారి ప్రతిష్ఠాత్మక ఖేల్‌రత్న అవార్డుకు...

‘ఖేల్‌రత్న’ వివాదంపై మను భాకర్‌

న్యూఢిల్లీ: జాతీయ క్రీడా అవార్డుల సిఫారసుల్లో ఏస్‌ షూటర్‌ మను భాకర్‌ పేరు లేకపోవడం వివాదాస్పదమైంది. పారిస్‌ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన మనును ఈసారి ప్రతిష్ఠాత్మక ఖేల్‌రత్న అవార్డుకు ఎంపిక చేస్తారని అందరూ భావించారు. కానీ, ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో ఆమె పేరు లేకపోవడం షాక్‌కు గురి చేసింది. క్రీడా వర్గాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో నష్టనివారణ చర్యల్లో భాగంగా అవార్డుల తుది జాబితా ఖరారు కాలేదని క్రీడా మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. మరోవైపు ప్రభుత్వ తీరుపై వెల్లువెత్తుతున్న వ్యతిరేకతను తగ్గించేందుకు మను స్వయంగా రంగంలోకి దిగినట్టుగా ఉంది. ‘నా దరఖాస్తులోనే ఏమైనా లోపాలు ఉండి ఉండవచ్చు’ అని అంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టింది.


తన అవార్డుకు సంబంధించిన ఊహాగానాలను పట్టించుకోవద్దని అందరికీ విజ్ఞప్తి చేసింది. కాగా, హాకీ జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌, పారాలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత ప్రవీణ్‌ కుమార్‌ పేర్లను ఖేల్‌రత్న అవార్డులకు ఎంపిక చేసినట్టు సమాచారం.

Updated Date - Dec 25 , 2024 | 04:18 AM