ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Boxers : మహిళల పోటీల్లో పురుషులా?

ABN, Publish Date - Aug 02 , 2024 | 04:20 AM

ఒలింపిక్స్‌లో ఇద్దరు మహిళా బాక్సర్లపై తీవ్రమైన చర్చ నడుస్తోంది. అల్జీరియాకు చెందిన ఇమేని ఖెలీఫ్‌ (25), తైవాన్‌కు చెందిన లిన్‌ యు టింగ్‌ (28) మహిళా బాక్సర్లు కాదన్న వాదన బలంగా వినిపిస్తోంది. గురువారం రాత్రి

అల్జీరియా, తైవాన్‌ బాక్సర్లపై వివాదం

విల్లేపింటే (ఫ్రాన్స్‌): ఒలింపిక్స్‌లో ఇద్దరు మహిళా బాక్సర్లపై తీవ్రమైన చర్చ నడుస్తోంది. అల్జీరియాకు చెందిన ఇమేని ఖెలీఫ్‌ (25), తైవాన్‌కు చెందిన లిన్‌ యు టింగ్‌ (28) మహిళా బాక్సర్లు కాదన్న వాదన బలంగా వినిపిస్తోంది. గురువారం రాత్రి ఖెలీ్‌ఫతో మహిళల 66 కి. విభాగం బౌట్‌ నుంచి ఇటలీ బాక్సర్‌ యాంజెలా అనూహ్యంగా వైదొలగింది. తొలి రౌండ్‌ 46 సె. ఆట తర్వాత ఖెలీఫ్‌ పంచ్‌లకు విలవిలలాడిన యాంజెలా బాధను తట్టుకోలేక విరమించుకుంది. అయితే ఖెలీ్‌ఫను చూసిన వారంతా ఆమె..పురుష బాక్సరని అభిప్రాయపడ్డారు. ఖెలీఫ్‌ పంచ్‌లకు భయపడి బౌట్‌ నుంచి యాంజెలా వైదొలగిందని ఆమె పట్ల సానుభూతి ప్రకటిస్తున్నారు. ఖెలీ్‌ఫలో టెస్టోస్టెరోన్‌ స్థాయిలు అధికంగా ఉన్నాయనే వాదనలనూ వారు గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మహిళల పోటీలకు ఖెలీ్‌ఫను ఎలా అనుమతించారని ఐఓసీని వారు నిలదీస్తున్నారు. పైగా..గత ఏడాది ఢిల్లీ వేదికగా అంతర్జాతీయ బాక్సింగ్‌ సంఘం (ఐబీఏ) నిర్వహించిన వరల్డ్‌ మహిళా బాక్సింగ్‌ చాంపియన్‌షి్‌ప సందర్భంగా ఇమేని, లిన్‌ యు అనర్హత వేటుకు గురవడాన్ని వారు ప్రస్తావిస్తున్నారు.

Updated Date - Aug 02 , 2024 | 04:20 AM

Advertising
Advertising
<