ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చెస్‌ ఒలింపియాడ్‌ ట్రోఫీ మాయం

ABN, Publish Date - Sep 21 , 2024 | 03:34 AM

అఖిల భారత చెస్‌ సమాఖ్య (ఏఐసీఎఫ్‌) ఆఫీసులో ఉంచిన చెస్‌ ఒలింపియాడ్‌ గప్రిన్‌దాష్విలి ట్రోఫీ మాయమైంది. దీనిపై తాము పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఏఐసీఎఫ్‌ అధికారులు వెల్లడించారు.

చెన్నై: అఖిల భారత చెస్‌ సమాఖ్య (ఏఐసీఎఫ్‌) ఆఫీసులో ఉంచిన చెస్‌ ఒలింపియాడ్‌ గప్రిన్‌దాష్విలి ట్రోఫీ మాయమైంది. దీనిపై తాము పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఏఐసీఎఫ్‌ అధికారులు వెల్లడించారు. తాజా ఎడిషన్‌కు ఆతిథ్యమిస్తున్న బుడాపెస్ట్‌ (హంగేరీ)కు ఈ ట్రోఫీని తీసు కురావాల్సిందిగా అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య(ఫిడే) కోరడంతో.. ట్రోఫీ చోరీకి గురైందన్న విషయం వెలుగులో కొచ్చింది. వివరాల్లోకెళితే.. గత ఎడిషన్‌ ఒలింపియాడ్‌ రెండే ళ్లక్రితం చెన్నైలో జరిగింది. అందులో ఉజ్బెకిస్థాన్‌ విజేతగా నిలవగా, భారత పురుషుల జట్టు కాంస్యం గెలిచింది. అయితే.. ఒలింపియాడ్‌ టోర్నీలో ఓపెన్‌, మహిళల విభాగాల్లో మెరుగైన ప్రదర్శన చేసిన జట్టుకు గప్రిన్‌దాష్విలి ట్రోఫీని అందజేస్తారు. గత ఎడిషన్‌లో భారత జట్టు ఈ ట్రోఫీని గెలుచుకుంది. కాగా, రోలింగ్‌ ట్రోఫీని జట్టుకు ఇచ్చి.. అసలైన ట్రోఫీని నిర్వాహకుల దగ్గరే ఉంచుకుంటారు. ఆ అసలైన ట్రోఫీనే ఇప్పుడు చోరీకి గురైంది.

Updated Date - Sep 21 , 2024 | 03:34 AM