ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Team India: విదేశీయుడికి టీమ్ ఇండియా కొత్త బౌలింగ్ కోచ్ బాధ్యతలు

ABN, Publish Date - Sep 14 , 2024 | 12:11 PM

టీమిండియా కొత్త బౌలింగ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ మోర్నీ మోర్కెల్‌ను బీసీసీఐ ప్రకటించింది. చెన్నై టెస్ట్‌కు ముందు నిర్వహించిన శిక్షణా శిబిరానికి ఒక రోజు ముందు ఆయన పిక్స్ వెలుగులోకి వచ్చాయి. ఆయనకు సంబంధించిన మరిన్ని విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Team India bowling coach

టీమిండియా(team india) కొత్త బౌలింగ్ కోచ్ పేరును బీసీసీఐ తాజాగా ప్రకటించింది. గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్ అయిన తర్వాత, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ మోర్నీ మోర్కెల్‌(Morne Morkel)ను జట్టు మేనేజ్‌మెంట్‌లో భాగం చేయాలని కోరినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు BCCI కూడా మాజీ ఆఫ్రికన్ మోర్నీ మోర్కెల్ భారత జట్టుకు కొత్త బౌలింగ్ కోచ్‌గా ఉంటాడని, ఆయన బంగ్లాదేశ్‌తో చెన్నై టెస్ట్ మ్యాచ్‌కు ముందు శిక్షణా శిబిరంలో జట్టుతో చేరతాడని ప్రకటించింది. చెన్నై టెస్ట్‌కు ముందు నిర్వహించిన శిక్షణా శిబిరానికి ఒక రోజు ముందు అందుకు సంబంధించిన పిక్స్ వెలుగులోకి వచ్చాయి. అక్కడ మోర్న్ ఆటగాళ్లతో కలిసి కనిపించాడు.


గతంలో

మోర్కెల్ గతంలో బౌలింగ్ కోచ్‌గా 2 సంవత్సరాల పాటు లక్నో సూపర్‌జెయింట్స్‌కు బౌలింగ్ కోచ్ పాత్రను పోషించాడు. ఆ సమయంలో గౌతమ్ గంభీర్ కూడా మోర్కెల్ పనిని అర్థం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ మోర్నీ మోర్కెల్ 2006 నుంచి 2018 మధ్య అంతర్జాతీయ క్రికెట్‌లో పాల్గొన్నాడు. ఆ క్రమంలో మోర్కల్ నవంబర్ 2023 వరకు పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా పనిచేశాడు. ఆయన హయాంలో పాకిస్తాన్ జట్టు ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయిందని చెప్పవచ్చు. ఆ తర్వాత మోర్కెల్ సూపర్ జెయింట్స్ ఆఫ్ నమీబియా, డర్బన్ వంటి జట్లతో కూడా పనిచేశాడు.


7 నిమిషాలు ఆస్వాదించా

ఈ నేపథ్యంలో తాను దాదాపు 5 నుంచి 7 నిమిషాల పాటు ఈ విషయాన్ని ఆస్వాదించానని మోర్కెల్ తెలిపారు. ఇది మంచి అవకాశమని, తన కుటుంబంతో కూడా పంచుకున్నానని వెల్లడించారు. తాను చాలా సంవత్సరాలుగా క్రికెట్ అభిమానినని, ఇది చాలా ప్రత్యేకమైన క్షణమని వెల్లడించారు. ఈ విషయంలో తాను ఎంతో సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. అంతేకాదు ఇప్పుడు జట్టుతో ఉన్నానని, భారతదేశంతో ప్రయాణం ఎంతో గొప్పదని వెల్లడించారు.

కెరీర్

మోర్నే మోర్కెల్ అంతర్జాతీయ కెరీర్ గురించి మాట్లాడితే అతను 2006లో తన టెస్ట్ అరంగేట్రం చేశాడు. 86 టెస్ట్ మ్యాచ్‌లలో జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. మార్చి 2018లో దక్షిణాఫ్రికా తరపున 300 టెస్ట్ వికెట్లు తీసిన ఐదో బౌలర్‌గా నిలిచాడు. 117 ODI ఇంటర్నేషనల్, 44 T20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు కూడా ఆడాడు.


ఇవి కూడా చదవండి

Edible Oil: సామాన్యులకు షాకింగ్.. పెరగనున్న వంట నూనెల ధరలు


Adani Group: టైమ్ వరల్డ్స్ బెస్ట్ 2024 కంపెనీల జాబితాలో అదానీ గ్రూప్‌ రికార్డ్


Narendra Modi: 45 ఏళ్ల తర్వాత తొలిసారి దోడాకు ప్రధాని.. కారణమిదే..


Aadhaar Free Update: మీ ఆధార్ కార్డ్ అప్‌డేట్ చేశారా లేదా లాస్ట్ ఛాన్స్.. మిస్సైతే మీకే నష్టం..


Read MoreSports News and Latest Telugu News

Updated Date - Sep 14 , 2024 | 12:30 PM

Advertising
Advertising