Virat Kohli - MS Dhoni: కోహ్లీతో పాటు నన్నూ ఇంటికి పంపించండి.. ధోనీ గురించి సంచలన విషయం బయటపెట్టిన పాక్ మాజీ ప్లేయర్!
ABN, Publish Date - Jul 03 , 2024 | 12:31 PM
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రెండు ప్రపంచకప్‌లను అందించడమే కాదు.. ట్యాలెంట్ ఉన్న యువ క్రికెటర్లను ప్రోత్సహించి మెరుగైన ఫలితాలు రాబట్టాడు. సహచరలుకు మద్దతుగా నిలిచి వారు మెరుగ్గా రాణించేందుకు కృషి చేశాడు. ఈ మాట అంటున్నది భారత ఆటగాళ్లు కాదు.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఉమర్ అక్మల్.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) రెండు ప్రపంచకప్‌లను అందించడమే కాదు.. ట్యాలెంట్ ఉన్న యువ క్రికెటర్లను ప్రోత్సహించి మెరుగైన ఫలితాలు రాబట్టాడు. సహచరలుకు మద్దతుగా నిలిచి వారు మెరుగ్గా రాణించేందుకు కృషి చేశాడు. ఈ మాట అంటున్నది భారత ఆటగాళ్లు కాదు.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఉమర్ అక్మల్ (Umar Akmal). 2013లో తన సమక్షంలో జరిగిన ఆసక్తికర సంఘటనను అక్మల్ తాజాగా బయటపెట్టాడు. కోహ్లీ (Virat Kohli)కి ధోనీ ఎంత మద్దతుగా నిలిచాడో వివరించాడు.
``పాకిస్తాన్ జట్టు సభ్యులమైన మేం 2012-13 సీజన్‌లో భారత పర్యటనకు వెళ్లాం. ఒక రోజు ధోనీ, రైనా, యువరాజ్, షోయబ్ మాలిక్, నేను కలిసి డిన్నర్‌కు వెళ్లాం. ఆ సమయంలో ధోనీ దగ్గరకు టీమిండియా మేనేజర్ వచ్చాడు. పరుగులు చేయలేక ఇబ్బందులు పడుతున్న కోహ్లీని తప్పించాలని ధోనీకి సూచించాడు. అప్పుడు ధోనీ స్పందిస్తూ.. ``ఫైన్.. నేను ఇంటికి వెళ్లి ఆరు నెలలు అవుతోంది. రైనా కెప్టెన్సీ చేస్తాడు. కోహ్లీతో పాటు నాకు కూడా టికెట్ కొనండి`` అని చెప్పాడు. వెంటనే మేనేజర్.. ``దయచేసి కోహ్లీతో ముందుకెళ్లండి`` అని చెప్పి అక్కణ్నుంచి వెళ్లిపోయాడు`` అని అక్మల్ ఓ టీవీ కార్యక్రమంలో చెప్పాడు.
మేనేజర్ వెళ్లిన వెంటనే తాను ధోనీ వైపు ఆశ్చర్యంగా చూసి అలా ఎందుకు మాట్లాడావని అడిగానని, దానికి ధోని చెప్పిన సమధానం ఇప్పటికీ మర్చిపోలేనని అన్నాడు. ``విరాట్ మా జట్టులోని అత్యుత్తమ బ్యాటర్. కేవలం మూడు, నాలుగు మ్యాచ్‌ల్లో విఫలమైనంత మాత్రాన ఎలా పక్కన పెడతాం`` అని ధోనీ అన్నట్టు అక్మల్ పేర్కొన్నాడు. ధోనీ చెప్పిన సమాధానం విని తాను షాకయ్యానని, ఒక ఆటగాడికి కెప్టెన్ నుంచి ఇలాంటి మద్దతు లభిస్తే అంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదని అక్మల్ అన్నాడు.
ఇవి కూడా చదవండి..
Virat Kohli: విరాట్ కోహ్లీకి కీలక బాధ్యతలు.. అది సాధ్యమయ్యేనా?
Cricket: నేడు ఢిల్లీకి టీమిండియా క్రికెట్ టీమ్.. విమానశ్రయానికి భారీగా ఫ్యాన్స్..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jul 03 , 2024 | 12:31 PM