ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MS Dhoni: ధోని అన్నా... మీరు సూపర్.. ఓ అభిమాని కోసం ఆయన ఏం చేశారో తెలిస్తే ఫిదా అవాల్సిందే..!

ABN, Publish Date - Nov 04 , 2024 | 11:34 AM

టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన అభిమానులు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

MS Dhoni

MS Dhoni: ఎంఎస్ ధోని..ఈ పేరు అంటే తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. క్రికెట్‌లో తనదైన ముద్ర వేసుకొని వీపరితమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ఎంత గొప్ప స్థాయిలో ఉన్నప్పటికి ఎలాంటి గర్వం లేకుండా, చాలా కూల్‌గా కనిపిస్తుంటారు. ఆయనకు ఉన్న ఫాలోయింగ్ గురించి ఇక ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ధోని ఏం చేసినా తన అభిమానులు వైరల్ చేయడం మామూలే. ఈ క్రమంలోనే ధోని ఓ అభిమాని కోసం చేసిన పని నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.


అభిమాని కోసం..

ధోని అభిమాని ఒకరు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ కొన్నారు. అయితే, తన బైక్‌పై ఆటోగ్రాఫ్ చేయాలని ఎంఎస్ ధోనీని ఆ అభిమాని కోరాడు. అతడి కోరిక మేరకు బైక్‌ను చూసిన ధోని చాలా బాగుందని చెప్పి కాంప్లిమెంట్ ఇచ్చాడు. బైక్‌ను తానే స్వయంగా చేతితో తుడిచి ఆటోగ్రాఫ్ చేశాడు. తర్వాత బైక్‌ను స్టార్ట్ చేసి అభిమాని తోపాటు కాసేపు రయ్ రయ్ మంటూ చక్కర్లు కొట్టారు. ఇక ఈ సంఘటనను చూసిన అభిమానులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది.


బైక్ కనిపిస్తే చాలు..

ఈ వీడియో చూసిన ధోని అభిమానులు.. అన్నా... మీరు సూపర్, మీది గోల్డెన్ హార్ట్, మీ సింప్లిసిటీకి ఫిదా అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తూ ధోనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరికొందరు ధోని లాంటి ఒక సెలబ్రిటీ ఇలా చేయడం ఏంటి అని షాక్ అయ్యారు. కాగా, మహేంద్రసింగ్ ధోనికి క్రికెట్ అంటే ఎంతో.. బైకులన్నా అంతే ఇష్టం. నచ్చిన బైక్ కనిపిస్తే చాలు.. వెంటనే దానిని తన గ్యారేజ్‌కు తీసుకెళ్తారన్న సంగతి తెలిసిందే. అయితే, గతంలో కూడా ఎంఎస్. ధోని ఎంతో మంది అభిమానులకు తన ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. ఓ అభిమాని తన బైక్‌పై సంతకం చేయాలని కోరగా.. సంతకం చేసే ముందు ఏకంగా తన టీషర్ట్‌తో తుడిచి సంతకం చేశారు. ఆ వీడియో అప్పట్లో తెగ వైరల్ అయింది.


Also Read:

పరువూ దక్కలేదు

టీమిండియాపై సచిన్ సీరియస్.. ఊరుకునేది లేదంటూ..

తూర్పుగోదావరి జిల్లా ఘటనపై సీఎం చంద్రబాబు విచారం

For more sports news and telugu news

Updated Date - Nov 04 , 2024 | 11:43 AM