MS Dhoni: విశాఖలో ధోనీ విధ్వంసం.. సింగిల్ హ్యాండ్‌తో సిక్స్ ఎలా కొట్టాడో చూడండి..!
ABN, Publish Date - Apr 01 , 2024 | 09:54 AM
చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తనకు అచ్చొచ్చిన విశాఖలో దుమ్మురేపాడు. పాత ధోనీని తలపిస్తూ స్టేడియంలోని అభిమానులను ఉర్రూతలూగించాడు.
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) తనకు అచ్చొచ్చిన విశాఖలో దుమ్మురేపాడు. పాత ధోనీని తలపిస్తూ స్టేడియంలోని అభిమానులను ఉర్రూతలూగించాడు. డీసీ బౌలర్లను వణికించాడు. ఐపీఎల్ 2024 (IPL 2024) సీజన్‌లో భాగంగా విశాఖపట్నం వేదికగా ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది (CSK Vs DC).
ఈ మ్యాచ్‌లో ధోనీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 16 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ధోనీ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ధోనీ బ్యాటింగ్ అభిమానుల్లో జోష్ నింపింది. ఖలీల్ అహ్మద్ వేసిన 18వ ఓవర్‌లో ధోనీ కొట్టి సిక్స్ ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో చెన్నై టీమ్ ఓడినా ధోనీ బ్యాటింగ్ మాత్రం అభిమానులను అలరించింది. వింటేజ్ ధోనీ అంటూ అభిమానులు సంబరాలు చేసుకున్నారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్(52), రిషభ్ పంత్ (51) అర్థ శతకాలు సాధించారు. పృథ్వీ షా (27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43) చెలరేగాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 171 పరుగులే చేసి ఓటమి పాలైంది. అజింక్యా రహానే (45), ధోనీ (37 నాటౌట్) రాణించారు.
Updated Date - Apr 01 , 2024 | 10:01 AM