ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: పాండ్యా డ్రెస్సింగ్ రూంలో ఒకటే పూజలు..ఇందుకేనా?

ABN, Publish Date - Mar 12 , 2024 | 01:06 PM

ఐపీఎల్ 2024(ipl 2024) కోసం అన్ని ఫ్రాంచైజీల ఆటగాళ్లు తమ తమ జట్లలో చేరడం ప్రారంభించారు. ఇదే సమయంలో హార్దిక్ పాండ్యా(hardik pandya) ఈసారి ముంబై ఇండియన్స్‌కు బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ నేపథ్యంలో పాండ్యాకు సంబంధించిన ఓ డ్రెస్సింగ్ రూం పూజ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

IPL 2024(ipl 2024) సీజన్ 17 మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 22 నుంచి మొదలు కానున్న ఈ లీగ్ కోసం ఇప్పటికే ఆయా జట్లు సిద్ధమవుతున్నాయి. అంతేకాదు ఈసారి ప్రముఖ టీం ముంబై ఇండియన్స్‌ జట్టుకు కొత్త కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా వచ్చారు. రోహిత్ శర్మ స్థానంలో ఈ సీజన్‌లో హార్దిక్ పాండ్యా(hardik pandya) జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ క్రమంలో పాండ్యా ముంబై ఇండియన్స్(mumbai indians) జట్టులో తాజాగా చేరి సన్నాహాలు కూడా ప్రారంభించాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను ముంబై ఇండియన్స్ తమ సోషల్ మీడియా హ్యాండిల్లో షేర్ చేసింది.

వీడియోలో ముంబై(mumbai)లోని డ్రెస్సింగ్ రూంకు వచ్చిన హార్దిక్ పాండ్యాకు ఘనస్వాగతం లభించింది. ఆ క్రమంలో పాండ్యా ముందుగా గణేశుడి ఆశీస్సులు తీసుకున్నారు. దీంతోపాటు ఈ జట్టు హెడ్ కోచ్ మార్క్ బౌచర్ కొబ్బరికాయ కొట్టారు. ఇక హార్దిక్ పాండ్యాను చూస్తుంటే అతను పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడని తెలుస్తోంది. ఇది ముంబై ఇండియన్స్‌కు మాత్రమే కాకుండా టీమ్ ఇండియాకు కూడా గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ఏడాది జూన్-జూలైలో టీ 20 ప్రపంచ కప్ జరగనుండగా.. టీమ్ ఇండియాకు హార్దిక్ చాలా అవసరం.


హార్దిక్ కెప్టెన్సీలో గుజరాత్ జట్టు(gujarat titans)ను రెండుసార్లు ఫైనల్స్‌కు తీసుకెళ్లడంలో పాండ్యా విజయం సాధించాడు. 2022లో హార్దిక్ గుజరాత్ టైటాన్స్ అరంగేట్రం సీజన్‌లో IPL టైటిల్‌ను గెలుచుకుంది. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్(CSK), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) మధ్య జరగనుంది. గతేడాది భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో హార్దిక్ చీలమండ గాయం కారణంగా చాలా కాలం పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: IPL2024: జోరుగా ప్రాక్టీస్ చేస్తున్న హార్ధిక్ పాండ్యా.. వీడియో షేర్ చేసిన ముంబై ఇండియన్స్

Updated Date - Mar 12 , 2024 | 01:06 PM

Advertising
Advertising