ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Yuvraj Singh: మా నాన్నకు మానసిక సమస్యలున్నాయి.. వైరల్ అవుతున్న యువరాజ్ సింగ్ పాత వీడియో..

ABN, Publish Date - Sep 04 , 2024 | 08:50 AM

త‌న కుమారుడి అంత‌ర్జాతీయ కెరీర్‌ను జీవితాన్ని ధోనీ స‌ర్వ నాశ‌నం చేశాడ‌ని ఇటీవల యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశాడు. ధోనీపై యోగరాజ్ చేసిన సంచలన ఆరోపణలు వివాదాస్పదంగా మారాయి.

Yuvraj Singh with Dhoni

త‌న కుమారుడి అంత‌ర్జాతీయ కెరీర్‌ను జీవితాన్ని ధోనీ (MS Dhoni) స‌ర్వ నాశ‌నం చేశాడ‌ని ఇటీవల యువరాజ్ సింగ్ (Yuvraj Singh) తండ్రి యోగరాజ్ సింగ్ (Yograj Singh) సంచలన ఆరోపణలు చేశాడు. ధోనీపై యోగరాజ్ చేసిన సంచలన ఆరోపణలు వివాదాస్పదంగా మారాయి. ఈ నేపథ్యంలో కొన్ని నెలల క్రితం తన తండ్రి గురించి ఓ పాడ్‌కాస్ట్‌లో యువరాజ్ మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది పాత వీడియోనే అయినప్పటికీ తాజా ఆరోపణల నేపథ్యంలో ధోనీ అభిమానులు ఆ వీడియోను సర్క్యులేట్ చేస్తున్నారు.


ఆ పాడ్‌కాస్ట్‌లో యువరాజ్ తన తండ్రి వ్యాఖ్యల గురించి స్పందించాడు. ``మా నాన్నా యోగరాజ్ మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో బాధ ప‌డుతున్నాడు. అయితే.. ఈ విష‌యాన్ని ఆయ‌న అస్స‌లు అంగీక‌రించ‌డు`` అని ఆ వీడియోలో యువరాజ్ అన్నాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై ధోనీ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఇటీవల ఓ వీడియో విడుదల చేసిన యోగరాజ్ తన కుమారుడికి భారత ర‌త్న అవార్డు ఇవ్వాల‌ని డిమాండ్ చేశాడు. అలాగే ధోనీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు.


``నా కుమారుడు యువ‌రాజ్ సింగ్ జీవితాన్ని ధోనీ నాశ‌నం చేశాడు. అద్ధంలో తన మొహం తానే చూసుకుంటే తానేం చేశాడో అత‌డికే అర్థ‌మ‌వుతుంది. నేను ధోనీని ఎప్ప‌టికీ క్ష‌మించ‌ను. అత‌డు గొప్ప అట‌గాడే. కానీ నా కొడుకు యువీ కెరీన్‌ను దెబ్బ‌తీశాడు. ధోనీ గ‌నుక అడ్డు లేకుంటే నా బిడ్డ మ‌రో నాలుగైదు ఏళ్లు అంతర్జాతీయ క్రికెట్ ఆడేవాడు`` అని యోగరాజ్ ఆ వీడియోలో పేర్కొన్నాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి ధోనీ అభిమానుల ఆగ్రహానికి గురైంది.

ఇవి కూడా చదవండి..

Harbhajan Singh: పదివేల పరుగులు నువ్వు చేయలేకపోతే సిగ్గుపడాలి.. కోహ్లీతో హర్భజన్ ఏమన్నాడంటే..


రైలు ప్రమాదంలో కాలు కోల్పోయినా..


త్వరలో రిటైర్మెంట్‌పై నిర్ణయం : సైనా నెహ్వాల్‌


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 04 , 2024 | 08:50 AM

Advertising
Advertising