ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Neeraj Chopra - Manu Bhaker: నీరజ్ చోప్రా, మను బాకర్ ప్రేమ వివాహం? మను తండ్రి స్పందన ఏంటంటే..

ABN, Publish Date - Aug 13 , 2024 | 09:55 AM

వరుసగా రెండు ఒలింపిక్స్‌ల్లో రెండు పతకాలు సాధించిన స్టార్ జావెలిన్ థ్రో ప్లేయర్ నీరజ్ చోప్రా.. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన షూటర్ మను బాకర్. వీరిద్దరికీ ప్రస్తుతం మంచి క్రేజ్ ఏర్పడింది. పారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకల సందర్భంగా వీరిద్దరూ సన్నిహితంగా మెలగడం చర్చనీయాంశంగా మారింది.

Neeraj Chopra - Manu Bhaker Marriage?

వరుసగా రెండు ఒలింపిక్స్‌ల్లో రెండు పతకాలు సాధించిన స్టార్ జావెలిన్ థ్రో ప్లేయర్ నీరజ్ చోప్రా (Neeraj Chopra).. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన షూటర్ మను బాకర్ (Manu Bhaker). వీరిద్దరికీ ప్రస్తుతం మంచి క్రేజ్ ఏర్పడింది. పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics) ముగింపు వేడుకల సందర్భంగా వీరిద్దరూ సన్నిహితంగా మెలగడం చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరూ సిగ్గపడుతూ, నవ్వుతూ మాట్లాడుకోవడం, మను బాకర్ తల్లితో కూడా నీరజ్ సన్నిహితంగా మాట్లాడడం చాలా మందిలో అనుమానాలు రేకెత్తించాయి (Neeraj Chopra - Manu Bhaker Marriage).


మను బాకర్ తల్లి తలపై నీరజ్ చోప్రా చేయి వేసి ఒట్టు పెట్టినట్టుగా ఉన్న వీడియో కూడా సోషల్ మీడియాలో హోరెత్తింది. దీంతో నీరజ్, మను ప్రస్తుతం ప్రేమలో ఉన్నారని, త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు మొదలయ్యాయి. నిజానికి వారి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ, పెళ్లి వార్తలు మాత్రం సోషల్ మీడియాలో ఓ రౌండ్ వేశాయి. ఈ వార్తలపై మను బాకర్ తండ్రి రామ్ కిషన్ బాకర్ స్పందించారు. మను ఇంకా పెళ్లి వయసుకు రాలేదని, ఆమె పెళ్లి గురించి ఆలోచించడం లేదని అన్నారు.


``మనుకు ఇంకా పెళ్లి వయసు రాలేదు. మనుకు గానీ, మాకు గాని ఆమె పెళ్లి గురించి ఆలోచనే లేదు. నీరజ్ చోప్రాను మను తల్లి కొడుకులా భావిస్తుంది. అందుకే అలా మాట్లాడింది. వేరే ఇంకేం లేద``ని రామ్ కిషన్ బాకర్ కొట్టిపడేశారు. మరోవైపు, ఇదే విషయంపై నీరజ్ అంకుల్ కూడా స్పందించారు. నీరజ్ పెళ్లి చేసుకునే సమయంలో అందరికీ విషయం తెలుస్తుందని అన్నారు. కాగా, నీరజ్, మను హర్యానా రాష్ట్రానికి చెందినవారే కావడం ఈ పెళ్లి వార్తలకు బలం చేకూర్చుంది.

ఇవి కూడా చదవండి..

Neeraj Chopra: వాచ్ గురించే చర్చ..!!

Olympics 2024: అర్షద్ నదీమ్ కూడా మన బిడ్డే..!!


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 13 , 2024 | 09:55 AM

Advertising
Advertising
<