ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Rohit Sharma: రోహిత్ శర్మ-నీతా అంబానీ సీరియస్ డిస్కషన్.. అవార్డుల ప్రధానోత్సవంలోనూ ముభావంగానే..!

ABN, Publish Date - May 18 , 2024 | 08:23 PM

ఈ ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ టీమ్ తన ఆఖరి మ్యాచ్ ఆడేసింది. శుక్రవారం వాంఖడే స్టేడియం వేదికగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో ముంబై ఇండియన్స్ టీమ్ తలపడింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ధనాధన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. 38 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో ఏకంగా 68 పరుగులు చేశాడు.

Nita Ambani and Rohit Sharma

ఈ ఐపీఎల్ సీజన్‌లో (IPL 2024) ముంబై ఇండియన్స్ (MI) టీమ్ తన ఆఖరి మ్యాచ్ ఆడేసింది. శుక్రవారం వాంఖడే స్టేడియం వేదికగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో ముంబై ఇండియన్స్ టీమ్ తలపడింది (LSG vs MI). ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ (Rohit Sharma) ధనాధన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. 38 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో ఏకంగా 68 పరుగులు చేశాడు. అయినా ఈ మ్యాచ్‌లో ముంబై ఓటమి పాలైంది. ముంబైపై లఖ్‌నవూ 18 పరుగుల తేడాతో గెలుపొందింది. మ్యాచ్ అనంతరం మైదానంలో రోహిత్ శర్మ, ముంబై ఓనర్ నీతా అంబానీ (Nita Ambani) మధ్య సీరియస్ డిస్కషన్ జరిగింది.


నీతా అంబానీ అడిగిన ప్రశ్నలకు రోహిత్ సమాధానాలు చెబుతుండడం ఆ వీడియోలో కనిపిస్తోంది. ఆ సమయంలో ఇద్దరూ కాస్త సీరియస్‌గానే మాట్లాడుకున్నారు. మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో కోచ్, జట్టు మేనేజ్‌మెంట్ అవార్డుల ప్రధానోత్సవం చేశారు. ధనాధన్ ఇన్నింగ్స్ ఆడిన రోహిత్‌కు కోచ్ మార్క్ బుచర్ మెడల్ అనౌన్స్ చేశాడు. రోహిత్ జెర్సీకి నీతా అంబానీ బ్యాడ్జీ పెట్టారు. ఆ సమమయంలో కూడా ఇద్దరూ ముభావంగానే ఉన్నారు. నీతా అంబానీ మొక్కుబడిగా బ్యాడ్జీ పెట్టగానే రోహిత్ తిరిగి వెనక్కి వచ్చేశాడు.


మైదానంలో రోహిత్, నీతా అంబానీ మాట్లాడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోపై ఎవరికి తోచినట్టు వారు కామెంట్లు చేస్తున్నారు. ``దయచేసి ముంబై టీమ్‌తోనే ఉండాలని నీతా అడుగుతున్నారు``, ``వాళ్లు హార్దిక్ పాండ్యా గురించి మాట్లాడుకుంటున్నారు``, ``వారు ఏం మాట్లాడుకున్నారో ఎవరైనా చెప్పండి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

MS Dhoni: ధోనీ వల్లే కోహ్లీ ఈ స్థాయిలో ఉన్నాడు.. మరోసారి విరాట్‌ను టార్గెట్ చేసిన సునీల్ గవాస్కర్


Virat Kohli: ధోనీ, నేను కలిసి ఆడడం ఇదే చివరి సారేమో.. విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు!


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 18 , 2024 | 08:23 PM

Advertising
Advertising