ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Risabh Pant: కేవలం 5 ఎమ్‌ఎల్ ఆలివ్ ఆయిల్.. 4 నెలల్లో 16 కిలోలు తగ్గిన రిషబ్ పంత్..!

ABN, Publish Date - May 01 , 2024 | 02:50 PM

టీమిండియా స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్ రెండేళ్ల క్రితం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదం తర్వాత దాదాపు 15 నెలల పాటు పంత్ ఇంటికే పరిమితమయ్యాడు. దాదాపు ఏడాదిన్నర విశ్రాంతి తీసుకుని తాజా ఐపీఎల్‌తో తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాడు.

Risabh Pant

టీమిండియా స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ (Risabh Pant) రెండేళ్ల క్రితం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదం తర్వాత దాదాపు 15 నెలల పాటు పంత్ ఇంటికే పరిమితమయ్యాడు. దాదాపు ఏడాదిన్నర విశ్రాంతి తీసుకుని తాజా ఐపీఎల్‌ (IPL 2024)తో తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాడు. ఎటువంటి శారీరక శ్రమా లేకుండా ఇంటికే పరిమితం కావడంతో పంత్ బరువు పెరిగిపోయాడు. తిరిగి ఫిట్‌నెస్ సాధించేందుకు పంత్ చాలా శ్రమించాడట. కఠినమైన డైట్ పాటించాడట (Risabh Pant Diet).


పంత్‌కు చికెన్, రసమలై, బిర్యానీ మొదలైనవి చాలా ఇష్టమట. అయితే ఫిట్‌నెస్ సాధించే క్రమంలో వాటన్నిటికీ చాలా దూరంగా ఉన్నాడట. చిల్లీ చికెన్‌ను కేవలం 5 ఎమ్‌ఎల్ ఆలివ్ ఆయిల్‌ (Olive Oil)తో తయారు చేసుకుని తినేవాడట. చిల్లీ చికెన్ మాత్రమే కాదు.. ఏ ఆహారం తయారు చేసుకున్నా 5 ఎమ్‌ఎల్ ఆలివ్ ఆయిల్‌తోనే చేసుకునేవాడట. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ పర్యవేక్షణలో పంత్ కఠినంగా కసరత్తులు చేశాడు. అందుకోసం బెంగళూరులోని ఓ ఇంటిని రెంట్ తీసుకుని అక్కడకు మారిపోయాడు. ప్రమాదంలో పంత్ కుడి కాలుకి దెబ్బ తగిలిన సంగతి తెలిసిందే.


ఆ గాయం నుంచి కోలుకున్న తర్వాత ఫిట్‌నెస్ కోసం పంత్ కఠోర సాధన చేశాడు. ``ఇంట్లో తనే దగ్గరుండి వంట చేయించుకునేవాడు. ఏం చేసినా 5 ఎమ్‌ఎల్ ఆలివ్ ఆయిల్ మాత్రమే వాడేవాడు. బయటి ఫుడ్ తినేవాడు కాదు. టీవీ, ఫోన్, ఇతర గ్యాడ్జెట్స్‌ను పక్కన పడేసి రోజులో 8 గంటలు నిద్రపోయేవాడు. తర్వాతి రోజు ఉదయం శిక్షణ కోసం సిద్ధంగా ఉండేవాడు. అంత కఠినంగా వ్యాయామం, డైట్ చేయడం వల్ల నాలుగు నెలల్లోనే 16 కిలోలు తగ్గాడ``ని ఎన్‌సీఏ వర్గాలు తెలిపాయి.

ఇవి కూడా చదవండి..

Shocking Video: అత్తగారితో అల్లుడి ఎఫైర్.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోవడంతో గ్రామస్తులందరూ కలిసి ఏం చేశారంటే..


Puzzle: మీ కళ్లు చాలా పవర్‌ఫుల్ అనుకుంటున్నారా?.. ఈ ఫొటోలో ఉన్న ఐదు పైన్ ఆపిల్స్‌ను కనిపెట్టండి!


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 01 , 2024 | 02:53 PM

Advertising
Advertising