ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Paris olympics : మెరుపులు.. మరకలు

ABN, Publish Date - Aug 13 , 2024 | 06:18 AM

ప్రారంభోత్సవంలో ప్రదర్శించిన కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు జీస్‌సను, క్రైస్తవ మతాన్ని కించపరిచేలా ఉన్నాయని విమర్శలొచ్చాయి. అయితే మానవుల మధ్య హింస ఎంత అసంబద్ధమో చాటిచెబుతూ ప్రదర్శించిన ఆ కార్యక్రమాల వెనుక ఉద్దేశం మంచిదే అయినా..ప్రదర్శించిన తీరులో పొరపాట్లు జరిగాయని నిర్వాహకులు వివరించుకున్నారు. ఇక, పరేడ్‌లో దక్షిణ

‘సాంస్కృతిక’ పొరపాట్లు

వేలాదిమంది అథ్లెట్లు పాల్గొనే ఒలింపిక్స్‌ ఫ్యాన్స్‌ను ఎంత ఉర్రూతలూగిస్తాయో అంతకుమించి వివాదాలూ సృష్టిస్తాయి. పారిస్‌ విశ్వక్రీడలు కూడా అందుకు మినహాయింపు కాదు. పక్షం రోజులకుపైగా ప్రపంచ క్రీడాభిమానులకు మజా పంచిన పారిస్‌ క్రీడల్లో మెరుపులు, మరకలపై ఓ లుక్కేద్దాం.

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

ప్రారంభోత్సవంలో ప్రదర్శించిన కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు జీస్‌సను, క్రైస్తవ మతాన్ని కించపరిచేలా ఉన్నాయని విమర్శలొచ్చాయి. అయితే మానవుల మధ్య హింస ఎంత అసంబద్ధమో చాటిచెబుతూ ప్రదర్శించిన ఆ కార్యక్రమాల వెనుక ఉద్దేశం మంచిదే అయినా..ప్రదర్శించిన తీరులో పొరపాట్లు జరిగాయని నిర్వాహకులు వివరించుకున్నారు. ఇక, పరేడ్‌లో దక్షిణ కొరియా అథ్లెట్లను ఉత్తర కొరియా అథ్లెట్లుగా ఉచ్ఛరించడం పెద్ద దుమారం లేపింది. ఇందుకు అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ క్షమాణలు చెప్పాల్సి వచ్చింది. క్రీడా గ్రామంలో సౌకర్యాలపై అథ్లెట్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తంజేశారు. అమెరికన్‌ టెన్నిస్‌ స్టార్‌ కొకొ గాఫ్‌ అరకొర సౌకర్యాలపై ఫిర్యాదు కూడా చేసింది. పారి్‌సలో ఎండ అదరగొట్టడంతో..క్రీడా గ్రామంలో ఏసీలు లేక అథ్లెట్లు ఉక్కిరిబిక్కిరయ్యారు. దాంతో కొందరు స్టార్‌ ఆటగాళ్లు నగరంలోని లగ్జరీ హోటళ్లకు వెళ్లిపోయారు. పారిస్‌లో భారత ఎంబసీ అధికారులు తమ క్రీడాకారులకోసం 40 ఏసీలు ఏర్పాటు చేయాల్సి రావడం గమనార్హం.

ఆసీస్‌ చిన్నది.. అదరగొట్టింది

ఆస్ట్రేలియాకు చెందిన స్కేట్‌బోర్డ్‌ సంచలనం ఆరిసా ట్రై పారి్‌సలో అదరగొట్టింది. 14 ఏళ్ల ఈ చిన్నది ఫైనల్లో పింక్‌ హెల్మెట్‌తో బరిలోకి దిగి ఏకంగా స్వర్ణ పతకం దక్కించుకుంది. ఇలా, విశ్వక్రీడల్లో పసిడి నెగ్గిన పిన్నవయసు ఆసీస్‌ అథ్లెట్‌గా ఆరిసా రికార్డుకెక్కింది.

మను మరో చరిత్ర

భారత షూటింగ్‌ సంచలనం మను భాకర్‌ రెండు కాంస్య పతకాలతో కొత్త చరిత్ర లిఖించింది. మహిళల 10 మీ. ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత విభాగంలో, 10 మీ. ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ విభాగంలో సరబ్‌ జోత్‌తో కలిసి కాంస్య పతకాలు కొల్లగొట్టింది. మూడో పతకాన్ని త్రుటిలో చేజార్చుకుంది.

నీరజ్‌ వర్సెస్‌ నదీమ్‌

భారత్‌ స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా స్వర్ణానికి పాకిస్థాన్‌ అథ్లెట్‌ అర్షద్‌ నదీమ్‌ అడ్డుపడ్డాడు. అంచనాలను తలకిందులు చేస్తూ..డిఫెండింగ్‌ చాంప్‌ నీరజ్‌ను వెనక్కు నెట్టిన అర్షద్‌ ఒలింపిక్‌ రికార్డ్‌ (92.97 మీటర్లు)తో పసిడి పతకం చేజిక్కించుకున్నాడు.

స్విమ్మర్ల అస్వస్థత

కాలుష్య ప్రమాణాలు తక్కువ స్థాయిలో ఉన్న సెన్‌ నదిలో పోటీలు నిర్వహించడంపై స్విమ్మర్లు ఆగ్రహం వ్యక్తంజేశారు. నదిలోని ఈ కోలీ బాక్టీరియాతో బెల్జియం స్విమ్మర్‌ క్లేరీ మిచెల్‌ అస్వస్థతకు గురైంది. దాంతో బెల్జియం జట్టు మిక్స్‌డ్‌ రిలే ఈవెంట్‌ నుంచి వైదొలగింది. ట్రయాథ్లెట్లు బ్రిఫర్డ్‌ (స్విట్లర్లాండ్‌), మిస్లావ్‌చుక్‌ (కెనడా), ఓ స్వర్ణం, రజతం నెగ్గిన ఐర్లాండ్‌ స్విమ్మర్‌ డానియల్‌ వైఫెన్‌ పోటీల అనంతరం అస్వస్థతకు లోనయ్యారు.

బాక్సర్ల లింగ వివాదం

లింగ నిర్ధారణ పరీక్షల్లో విఫలమై నిరుడు ప్రపంచ మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌షి్‌ప నుంచి అనర్హతకు గురైన అల్జీరియాకు చెందిన ఇమేని ఖెలీఫ్‌, తైవాన్‌ బాక్సర్‌ లీ యు టింగ్‌లను ఒలింపిక్స్‌లో పోటీపడడంపై తీవ్ర దుమారం నెలకొంది. పురుష లక్షణాలున్న వీరిద్దరినీ మెగా ఈవెంట్‌లో ఎలా ఆడిస్తారంటూ చాలామంది తప్పుపట్టారు. అయితే, లింగ వివాదం ఏర్పడినా.. ఖెలిఫ్‌, లీ యు స్వర్ణ పతకాలు సాధించడం విశేషం.

లైల్స్‌..ఫొటో ఫిని్‌షలో

నోవా లైల్స్‌ రూపంలో పురుషుల 100 మీటర్ల స్ర్పింట్‌లో కొత్త స్టార్‌ వచ్చాడు. అయితే ఈ ఫైనల్‌ రేసు రేపిన ఉత్కంఠ అంతా ఇంతా కాదు. అమెరికా స్టార్‌ నోవా లైల్స్‌, జమైకా అథ్లెట్‌ కిషానే థాంమ్సన్‌ నువ్వా..నేనా అనేలా తలపడి కళ్లుమూసి తెరిచేలోపు రేస్‌ను పూర్తి చేశారు. దాంతో విజేతను తేల్చేందుకు ఫొటోఫిని్‌షను ఆశ్రయించాల్సి వచ్చింది. సెకనులో ఐదువేల వంతు తేడాతో లైల్స్‌ విజేతగా నిలిచాడు. అనంతరం లైల్స్‌ కొవిడ్‌ బారిన పడినా..200 మీ. పరుగులో కాంస్యం నెగ్గాడు.

తిరుగులేని బైల్స్‌

అమెరికా జిమ్నాస్టిక్‌ సూపర్‌ స్టార్‌ సిమోన్‌ బైల్స్‌ పారిస్‌లో తనదైన ముద్ర వేసింది. ప్రాక్టీస్‌లో గాయపడ్డా ఏకంగా హ్యాట్రిక్‌ స్వర్ణాలతోపాటు ఓ కాంస్య పతకాన్ని కైవసం చేసుకొని మహిళా జిమ్నాస్టిక్స్‌లో తనకు ఎదురులేదని చాటింది.

అనర్హతపై వివాదం

భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌పై అనర్హత పారిస్‌ ఒలింపిక్స్‌లో ప్రకంపనలు సృష్టించింది. 100 గ్రాముల బరువు అదనంగా ఉందనే కారణంతో మహిళల 50 కి. ఫ్రీస్టయిల్‌ రెజ్లింగ్‌ ఫైనల్‌ నుంచి ఆమెను డిస్‌క్వాలిఫై చేశారు. ఈ ఘటనపై యావద్భారత దేశంలో ఆగ్రహం పెల్లుబికింది. తనపై వేటును క్రీడా మధ్యవర్తిత్వ న్యాయస్థానంలో వినేశ్‌ సవాల్‌ చేసిన సంగతి తెలిసిందే.

Updated Date - Aug 13 , 2024 | 06:18 AM

Advertising
Advertising
<