ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chess Olympiad 2024: చెస్ ఒలింపియాడ్‌లో అరుదైన ఘటన.. భారత జాతీయ పతాకాన్ని పట్టుకున్న పాక్ చెస్ ప్లేయర్లు..

ABN, Publish Date - Sep 28 , 2024 | 12:15 PM

ఇటీవలే ముగిసిన చెస్ ఒలింపియాడ్ 2024లో భారత్ చిరస్మరణీయ విజయాలు సాధించింది. పురుషుల కేటగిరితో పాటు మహిళల విభాగంలోనూ భారత్‌ ఛాంపియన్‌గా నిలిచింది. మన దేశ అతిపెద్ద క్రీడా విజయాలలో ఒకటిగా చరిత్రలో నిలిచిపోయేలా భారత మహిళల, పురుషుల జట్లు చిరస్మరణీయ ప్రదర్శన చేశాయి.

Members of India and Pakistan's chess teams

ఇటీవలే ముగిసిన చెస్ ఒలింపియాడ్ 2024లో (Chess Olympiad 2024) భారత్ చిరస్మరణీయ విజయాలు సాధించింది. పురుషుల కేటగిరితో పాటు మహిళల విభాగంలోనూ భారత్‌ ఛాంపియన్‌గా నిలిచింది. మన దేశ అతిపెద్ద క్రీడా విజయాలలో ఒకటిగా చరిత్రలో నిలిచిపోయేలా భారత మహిళల, పురుషుల జట్లు చిరస్మరణీయ ప్రదర్శన చేశాయి. అరుదైన ఈ డబుల్‌ బొనాంజాను భారత చెస్ ప్లేయర్లు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. టీమిండియా వేడుకలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి (Viral Video).


భారత ఆటగాళ్ల సెలబ్రేషన్స్‌కు సంబంధించి ఒక్క వీడియో మాత్రం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఆ వీడియోలో పాకిస్థాన్ చెస్ ప్లేయర్లు (Pakistan's chess players) కూడా భారత ఆటగాళ్లతో జత కలిశారు. భారత జట్టు సభ్యులతో కలిసి నిలబడి భారత జాతీయ పతాకాన్ని (Indian Flag) పట్టుకున్నారు. ఆ వీడియో ఇరు దేశాల్లోనూ బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోపై ఎన్నో రకాల స్పందనలు వస్తున్నాయి. భారత్, పాకిస్తాన్ మధ్య ఎప్పట్నుంచో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య క్రికెట్, హాకీ, టెన్నిస్, చెస్.. ఇలా ఏ పోటీ జరిగినా అభిమానులు అసక్తికరంగా గమనిస్తున్నారు.


గతంలో హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్-చైనా తలపడ్డాయి. ఈ మ్యాచ్ తర్వాత పాకిస్థాన్ హాకీ ఆటగాళ్లు చైనా జెండాను పట్టుకున్నారు. సోషల్ మీడియాలో ఆ వీడియో కూడా వైరల్‌గా మారింది. అప్పుడు చైనా జెండా పట్టుకున్న పాక్ ఆటగాళ్లపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే తాజాగా భారత జెండా పట్టుకున్న పాక్ చెస్ ఆటగాళ్ల విషయంలో అలాంటి విమర్శలు వ్యక్తం కావడం లేదు. కొందరు నెటిజన్లు పాక్ ఆటగాళ్ల సహృదయతను ప్రశంసిస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

వరుణుడిదే ఆధిపత్యం


12 ఏళ్ల క్రితం పోటీపడింది.. ఇప్పుడు పతకం సొంతమైంది


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 28 , 2024 | 12:15 PM