Paris Olympics: ``నీ అందాన్ని తట్టుకోలేకపోతున్నాం.. ఇంటికి వెళ్లిపో``.. పరాగ్వే స్విమ్మర్‌కు విచిత్ర అనుభవం!
ABN, Publish Date - Aug 09 , 2024 | 08:02 PM
పారిస్ ఒలింపిక్స్‌లో పరాగ్వేకు చెందిన స్విమ్మర్ లువానా అలోన్సోకు విచిత్రమైన అనుభవం ఎదురైంది. తన అందమే ఆమెకు ఇబ్బందులు తెచ్చి పెట్టింది. ఒలింపిక్ వేడుకలు పూర్తి కాకుండానే స్వదేశానికి పయనం కావాల్సి వచ్చింది.
పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics)లో పరాగ్వేకు చెందిన స్విమ్మర్ లువానా అలోన్సోకు (Luana Alonso) విచిత్రమైన అనుభవం ఎదురైంది. తన అందమే ఆమెకు ఇబ్బందులు తెచ్చి పెట్టింది. ఒలింపిక్ వేడుకలు పూర్తి కాకుండానే స్వదేశానికి పయనం కావాల్సి వచ్చింది. 20 ఏళ్ల అలోన్సో తన అందంతో, తన ప్రవర్తనతో తోటీ క్రీడాకులకు అసౌకర్యం కలిగిస్తుండడంతో పరాగ్వే (Paraguay) దేశ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆమె స్వదేశానికి వెళ్లిపోక తప్పలేదు.
అలోన్సో జులై 27న జరిగిన 100 మీటర్ల ఉమెన్స్ బటర్ ఫ్లై స్విమ్మింగ్ విభాగంలో పోటీ పడింది. 0.24 సెకెన్ల తేడాతో ఓటమి పాలై సెమీస్ చేరే అవకాశాన్ని కోల్పోయింది. అలోన్సో ఓటమి పాలైనప్పటికీ పారిస్ ఒలింపిక్ వేడుకలు ముగిసే ఆగస్టు 11వ తేదీ వరకు ఆమెను ఒలింపిక్ గ్రామంలోనే ఉంచాలని పరాగ్వే అధికారులు తొలుత భావించారు. దీంతో ఆమె ఇతర మ్యాచ్‌లను చూస్తూ అక్కడే ఉండిపోయింది. ఆ క్రమంలో ఆమె తన అందాల ప్రదర్శనతో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. స్విమ్ సూట్‌లు ధరిస్తూ అందర్నీ ఆకర్షించింది. దీంతో ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది.
అలోన్సో అందాల ప్రదర్శన, ఆమె ప్రవర్తన తీరు పరాగ్వే బృందానికి చిరాకు తెప్పించింది. ఆమె క్రీడాకారుల దృష్టి మరల్చుతోందని అధికారులు భావించారు. దీంతో ఆమెను వెంటనే స్వదేశానికి పంపించేశారు. స్వదేశానికి చేరుకున్న అలోన్సో ఏకంగా తన స్విమ్మింగ్ కెరీర్‌కే రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ షాకిచ్చింది. తనకు అండగా నిలిచిన వారికి ధన్యవాదాలు తెలిపింది.
ఇవి కూడా చదవండి..
Hockey: పారిస్ ఒలింపిక్స్‌లో హాకీ పతకం వెనుక ఒడిశా ప్రభుత్వం.. మాజీ సీఎం ఎలా ప్రోత్సహించారంటే..!
Olympics 2024: అర్షద్ నదీమ్ కూడా మన బిడ్డే..!!
మరిన్ని క్రీడా వార్తల కోసం.. క్లిక్ చేయండి.
Updated Date - Aug 09 , 2024 | 08:02 PM