Prithvi Shaw : తనకు తానే శత్రువు
ABN, Publish Date - Dec 21 , 2024 | 04:08 AM
యువ క్రికెటర్ పృథ్వీ షా ప్రస్తుతం కెరీర్‌లో అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో విఫలమవడంతో హజారే ట్రోఫీకి
జట్టులో అతడున్నా లేనట్టే..
పృథ్వీ షాపై ఎంసీఏ
ముంబై: యువ క్రికెటర్ పృథ్వీ షా ప్రస్తుతం కెరీర్‌లో అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో విఫలమవడంతో హజారే ట్రోఫీకి అతడిని ముంబై క్రికెట్ సంఘం (ఎం సీఏ) పక్కనబెట్టింది. ఇక ఐపీఎల్ వేలంలో అతడిని ఏ జట్టూ కొనుగోలు చేయలేదు. అయితే దీనంతటికీ పృథ్వీ స్వయంకృతాపరాధమే అని ఎంసీఏ తేల్చింది. ‘పృథ్వీషాకు ఎవరూ శత్రువులు లేరు. తనకు తానే శత్రువు. ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై జట్టులో అతను ఉన్నా కూడా 10 మందితోనే ఆడామను కోవాలి. ఎందుకంటే షా మైదానంలో ఉన్నా లేనట్టే. అతడి దగ్గరికి బంతి వచ్చినా కూడా అతికష్టంగా దాన్ని అందుకోవడం కనిపించింది. బ్యాటింగ్ సమయంలోనూ బంతిని ఆడేందుకు ఇబ్బందిపడ్డాడు. ప్రాక్టీస్ సెషన్లకు డుమ్మా కొట్టేవాడు. రాత్రుళ్లు బయట తిరిగి ఉదయం 6 గంటలకు హోటల్ చేరేవాడు. సీనియర్లు కూడా అతడి ప్రవర్తన నచ్చక ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే సెలెక్టర్లు ప్రభావితం చెందుతారనుకోవడం తప్పు’ అని ఎంసీఏ అధికారి ఒకరు ఘాటుగా స్పందించాడు. హజారే ట్రోఫీకి ఎంపికవకపోవడంతో పృథ్వీ.. ‘ఎన్ని పరుగులు చేసినా, సెలెక్టర్లకు నమ్మకం కలుగలేదా?’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పశ్నించడం తెలిసిందే.
Updated Date - Dec 21 , 2024 | 04:08 AM