Rahmanullah Gurbaz: టీ20 WCలో అప్ఘాన్ ఆటగాడు అరుదైన రికార్డ్.. మనోళ్లకు దక్కనిచోటు
ABN, Publish Date - Jun 26 , 2024 | 09:08 AM
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2024(ICC T20 World Cup 2024) సెమీ ఫైనల్ జట్లు ఖరారయ్యాయి. భారత్, అఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లు సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. ఈ క్రమంలో బంగ్లాదేశ్ జట్టుపై అప్ఘాన్ గెల్చిన క్రమంలో గుర్బాజ్ 43 పరుగులు చేసి అరుదైన ఘనతను దక్కించుకున్నాడు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2024(ICC T20 World Cup 2024) సెమీ ఫైనల్ జట్లు ఖరారయ్యాయి. భారత్, అఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లు సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. సూపర్ 8 దశ చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్(bangladesh)పై అఫ్ఘనిస్తాన్(Afghanistan) ఉత్కంఠ విజయంతో తొలిసారి సెమీస్‌లోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా సెమీ ఫైనల్లో అఫ్ఘనిస్తాన్‌కు చెందిన రహ్మానుల్లా గుర్బాజ్(Rahmanullah Gurbaz) కన్నీరు పెట్టుకున్నాడు. ఈ మ్యాచులో బంగ్లాదేశ్‌పై గుర్బాజ్ 43 పరుగులు చేసి అరుదైన ఘనతను దక్కించుకున్నాడు. దీంతో T20 ప్రపంచ కప్ 2024లో ఇప్పటివరకు 281 పరుగులతో గుర్బాజ్ అత్యధిక పరుగులు(Most runs) చేసిన ఆటగాడిగా అగ్రస్థానంలో ఉన్నాడు.
గుర్బాజ్ 7 ఇన్నింగ్స్‌ల్లో 40.14 సగటుతో 281 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్(travis head) 255 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. అదే సమయంలో అఫ్ఘనిస్తాన్ బ్యాట్స్‌మెన్ ఇబ్రహీం జద్రాన్ 229 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో వెస్టిండీస్‌కు చెందిన నికోలస్ పూరన్ 228, 219 పరుగులు చేసిన USA ఆటగాడు ఆండ్రూ గౌస్ నాలుగు, ఐదవ స్థానాల్లో ఉన్నారు. ఈ జాబితాలో భారత్ నుంచి టాప్ 5 ఒక్కరూ కూడా చోటుదక్కించుకోలేదు. కానీ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(rohit sharma) 191 పరుగులతో 7వ స్థానంలో ఉన్నాడు.
T20 వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 బ్యాట్స్‌మెన్స్
రహ్మానుల్లా గుర్బాజ్ - అఫ్ఘనిస్తాన్ - 281 పరుగులు
ట్రావిస్ హెడ్ - ఆస్ట్రేలియా - 255 పరుగులు
ఇబ్రహీం జద్రాన్ - అఫ్ఘనిస్తాన్ - 229 పరుగులు
నికోలస్ పూరన్ - వెస్టిండీస్ - 228 పరుగులు
ఆండ్రూ గౌస్ - అమెరికా - 219 పరుగులు
ఇది కూడా చదవండి:
Lok Sabha Speaker: లోక్‌సభ స్పీకర్ ఎన్నిక కోసం నేడే ఓటింగ్..ఎవరు గెలుస్తారంటే..!
Rahul Gandhi : విపక్ష నేతగా రాహుల్
Read Latest Sports News and Telugu News
Updated Date - Jun 26 , 2024 | 09:14 AM