ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Paris Olympics 2024: పతక వేటలో రీతిక హూడాకు శుభారంభం.. 76 కేజీల రెజ్లింగ్‌లో సునాయాస విజయం!

ABN, Publish Date - Aug 10 , 2024 | 05:26 PM

పారిస్ ఒలింపిక్స్ 2024లో మరో రెజ్లింగ్ పతకం కోసం పోటీ మొదలైంది. 76 కేజీల రెజ్లింగ్ విభాగంలో పోటీ పడుతున్న రీతికా హుడాకు శుభారంభం దక్కింది. శనివారం మధ్యాహ్నం జరిగిన తన ప్రారంభ రౌండ్ మ్యాచ్‌లో హంగేరీకి చెందిన బెర్నాడెట్ నాగిని సునాయాసంగా ఓడించింది.

Reetika Hooda wins her opening bout

పారిస్ ఒలింపిక్స్ 2024 (Paris Olympics 2024)లో మరో రెజ్లింగ్ (Wrestling) పతకం కోసం పోటీ మొదలైంది. 76 కేజీల రెజ్లింగ్ విభాగంలో పోటీ పడుతున్న రీతికా హుడాకు (Reetika Hooda) శుభారంభం దక్కింది. శనివారం మధ్యాహ్నం జరిగిన తన ప్రారంభ రౌండ్ మ్యాచ్‌లో హంగేరీకి చెందిన బెర్నాడెట్ నాగిని సునాయాసంగా ఓడించింది. నాగి యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌లో రెండుసార్లు కాంస్య పతక విజేత. ఆమెపై రీతిక 12-2తో అలవోకగా గెలుపొందింది. దీంతో మరికొద్ది గంటల్లో జరిగే క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది.


క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నెంబర్ వన్, కిర్గిజిస్తాన్‌కు చెందిన ఐపెరి మెడెట్ కైజీ (Aiperi Medet Kyzy)తో రీతిక తలపడనుంది. హర్యానాకు చెందిన ఈ 21 ఏళ్ల రెజ్లర్ కచ్చితంగా పతకం సాధిస్తుందని భారత్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. 76 కేజీల హెవీవెయిట్‌లో అర్హత సాధించిన తొలి భారతీయురాలు రీతిక. ఈమె గతంలో 72 కేజీల విభాగంలో పోటీపడింది. ఇప్పుడు ఆమెకు ఈ 76 కేజీల వెయిట్ క్లాస్ కొత్తది. అందుకోసం ఆమె తన సహజ శరీర బరువును పెంచుకోవాల్సి వచ్చింది. మరికొద్ది గంటల్లో జరిగే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో రీతికకు అసలైన సవాలు ఎదురుకానుంది. ప్రపంచ నెంబర్ వన్ అయిన మెడెట్ కైజీని ఓడిస్తే మరో పతకానికి భారత్ చేరవైనట్టే.


కాగా, 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉందనే కారణంతో భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌(Vinesh Phogat)‌పై వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (CAS) ఇవాళ తీర్పు వెలువరించనుంది. మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలను పరిష్కరించే స్పోర్ట్స్ గవర్నింగ్ బాడీ విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం.. పారిస్ ఒలింపిక్స్‌లో రజత పతకం కోసం వినేష్ చేసిన అభ్యర్థనపై నిర్ణయాన్ని పారిస్ కాలమానం ప్రకారం శనివారం (భారత కాలమానంలో రాత్రి 9:30) ప్రకటించనున్నారు.

ఇవి కూడా చదవండి..

Aman Sehrawat: అమన్ కూడా బరువు తగ్గాడా? వేటు నుంచి తప్పించుకునేందుకు 10 గంటల్లో 4.6 కేజీలు తగ్గాడా?


Vinesh Phogat: వినేశ్ ఫొగట్ అప్పీల్‌పై నేడే తీర్పు.. రాత్రి 9.30 కోసం భారతావని ఎదురుచూపు


పస్తులుండి.. చందాలు పోగేసి..


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 10 , 2024 | 05:26 PM

Advertising
Advertising
<