ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Rinku Singh: ప్రపంచకప్ ఆడకపోవడం బాధాకరమే.. ఆ రోజు రోహిత్ వచ్చి ఏం చెప్పాడంటే..: రింకూ సింగ్

ABN, Publish Date - May 29 , 2024 | 12:54 PM

మరికొద్ది రోజుల్లో అమెరికా-వెస్టిండీస్‌లో టీ-20 ప్రపంచకప్ ప్రారంభం కాబోతోంది. ఈ ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన జట్టులో యువ బ్యాటర్ రింకూ సింగ్‌కు చోటు దక్కకకపోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఎందరో మాజీలు రింకూ సింగ్‌కు మద్దతుగా మాట్లాడారు.

Rinku Singh with Rohit Sharma

మరికొద్ది రోజుల్లో అమెరికా-వెస్టిండీస్‌లో టీ-20 ప్రపంచకప్ (T20 World Cup ) ప్రారంభం కాబోతోంది. ఈ ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన జట్టులో యువ బ్యాటర్ రింకూ సింగ్‌ (Rinku Singh)కు చోటు దక్కకకపోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఎందరో మాజీలు రింకూ సింగ్‌కు మద్దతుగా మాట్లాడారు. ఓ ఐపీఎల్ మ్యాచ్‌ మధ్యలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) కూడా రింకూ సింగ్‌ను ప్రత్యేకంగా కలిసి మాట్లాడాడు. అయితే ఇప్పటివరకు ఆ విషయంపై రింకూ సింగ్ మాత్రం స్పందించలేదు. తాజాగా తన మనసులో మాటను బయటపెట్టాడు.


``బ్యాటర్‌గా మంచి ప్రదర్శన చేసిన నాకు ప్రపంచకప్ జట్టులో స్థానం దక్కలేదు. అందుకు చాలా బాధపడ్డా. జట్టును ప్రకటించిన తర్వాత చాలా అప్‌సెట్ అయ్యా. అయినా మన చేతుల్లో లేని విషయాల గురించి ఎక్కువ ఆలోచించకూడదు. ఏం జరిగినా మన మంచికే అనుకుని ముందుకు వెళ్లడమే. జట్టు కూర్పు వల్లే నన్ను ఎంపిక చేయలేదని అనుకుంటున్నా. రోహిత్ భయ్యా కూడా అదే చెప్పాడు. మరో రెండేళ్ల తర్వాత మరో ప్రపంచకప్ వస్తుంది. ఇప్పుడే కంగారుపడాల్సిన అవసరం లేదు. అత్యుత్తమంగా ఆడితే తప్పకుండా అవకాశం వస్తుందని రోహిత్ ధైర్యం చెప్పినట్టు`` రింకూ తెలిపాడు.


ఇక, తాజా ఐపీఎల్ సీజన్‌లో కోల్‌కతా ఛాంపియన్‌గా నిలవడం పట్ల రింకూ సింగ్ సంతోషం వ్యక్తం చేశాడు. ``నేను కేకేఆర్‌తో ఏడేళ్లుగా ప్రయాణం చేస్తున్నా. మా టీమ్ టైటిల్ గెలవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఈ క్రెడిట్ అంతా గంభీర్‌కే దక్కుతుంది. ఎట్టకేలకు ట్రోఫీ సాధించగలిగాం. అంతా దేవుడి దయ`` అంటూ రింకూ సింగ్ పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి..

T20 World Cup 2024: న్యూయార్క్‌ చేరుకున్న టీమ్ ఇండియా.. సన్నాహాలు షురూ..


థియేటర్లలో వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లు!


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 29 , 2024 | 04:44 PM

Advertising
Advertising