ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Rohit Sharma: రిటైర్మెంట్ ఊహాగానాలు.. రోహిత్ శ‌ర్మ ఏమ‌న్నాడో తెలుసా?

ABN, Publish Date - Apr 12 , 2024 | 05:26 PM

ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్‌లో రోహిత్ శర్మను కెప్టెన్‌గా తప్పించినప్పటి నుంచి అతడి గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రోహిత్ శ‌ర్మ‌ త‌న రిటైర్మెంట్ గురించి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు.

రోహిత్ శర్మ

ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్‌లో (IPL 2024) రోహిత్ శర్మను (Rohit Sharma) కెప్టెన్‌గా తప్పించినప్పటి నుంచి అతడి గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రోహిత్ శ‌ర్మ‌ త‌న రిటైర్మెంట్ గురించి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు. రిటైర్మెంట్ ప్రకటించాలనే ఆలోచన ఇప్పట్లో లేదని తెలిపాడు. ఇండియాకు వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను అందించాల‌నే ఉద్దేశంతో ఉన్న‌ట్లు అత‌ను చెప్పాడు. వ‌చ్చే ఏడాది జ‌రిగే ఐసీసీ వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్లోనూ ఆడాల‌ని ఉన్న‌ట్లు తెలిపాడు (Rohit Retirement).


``బ్రేక్‌ఫాస్ట్ విత్ ఛాంపియ‌న్స్`` అనే షోలో పాల్గొన్న రోహిత్ తన రిటైర్మెంట్ గురించి మాట్లాడాడు. ``నాకు ప్రస్తుతం రిటైర్మెంట్ గురించిన ఆలోచన లేదు. కానీ జీవితం మ‌న‌ల్ని ఎక్క‌డికి తీసుకెళ్తుందో తెలియ‌దు. ప్ర‌స్తుతం నా ప్రదర్శన బాగానే ఉంది. మ‌రికొన్ని ఏళ్ల పాటు ఇలాగే ఆడగలననే నమ్మకం ఉంది. వ‌ర‌ల్డ్‌క‌ప్ గెల‌వాల‌నే ఆశ ఉంది. అలాగే 2025లో జరిగే డబ్ల్యూటీసీ ఫైన‌ల్ కూడా గెల‌వాల‌ని ఉంది. ఆ రెండూ నెరవేరుతాయని ఆశిస్తున్నా`` అంటూ రోహిత్ పేర్కొన్నాడు.


తమ తరం ఆటగాళ్లందరం వన్డే ప్రపంచకప్ చూస్తూనే పెరిగామని, తన వరకు వన్డే ప్రపంచకప్పే అసలైన టోర్నీ అని అన్నాడు. గతేడాది అభిమానుల మధ్య అద్భుతంగా ఆడి ఫైనల్ చేరుకున్నామని, ఒకే ఒక్క చెడ్డ రోజు తమకు కప్ దూరం చేసిందని అన్నాడు. కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవని, ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు తమ కంటే ఉత్తమంగా ఆడి కప్ గెలిచిందని రోహిత్ అభిప్రాయపడ్డాడు.

ఇవి కూడా చదవండి..

Cricket: వీడెవడ్రా బాబు ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌లు.. పవర్ ప్లేలో సెంచరీ దాటిన స్కోర్..


IPL Tickets: బ్లాక్‌లో ఐపీఎల్‌ టిక్కెట్ల విక్రయం.. 8 మంది అరెస్ట్‌


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 12 , 2024 | 05:26 PM

Advertising
Advertising