Gautam Gambhir: సీనియర్లకు షాక్.. కివీస్‌తో సిరీస్ ఓటమి నేపథ్యంలో గంభీర్ కీలక నిర్ణయం..
ABN, Publish Date - Oct 27 , 2024 | 11:50 AM
దాదాపు పన్నెండేళ్ల తర్వాత సొంత గడ్డపై టీమిండియా టెస్ట్ సిరీస్ కోల్పోయింది. స్వదేశంలో తిరుగు లేని జట్టుగా ఆధిపత్యం చెలాయించే భారత్‌కు ఇది చాలా పెద్ద షాక్. బ్యాటర్లు దారుణంగా విఫలం కావడంతో మూడు టెస్ట్‌ల సిరీస్‌లో టీమిండియా రెండు టెస్ట్‌ల్లో పరాజయం పాలై సిరీస్‌ను కోల్పోయింది.
టీమిండియా హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంభీర్ (Gautam Gambhir)కు న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్ కోలుకోలేని షాకిచ్చింది (Ind vs NZ Test Series). దాదాపు పన్నెండేళ్ల తర్వాత సొంత గడ్డపై టీమిండియా టెస్ట్ సిరీస్ కోల్పోయింది. స్వదేశంలో తిరుగు లేని జట్టుగా ఆధిపత్యం చెలాయించే భారత్‌కు ఇది చాలా పెద్ద షాక్. బ్యాటర్లు దారుణంగా విఫలం కావడంతో మూడు టెస్ట్‌ల సిరీస్‌లో టీమిండియా రెండు టెస్ట్‌ల్లో పరాజయం పాలై సిరీస్‌ను కోల్పోయింది. మూడో టెస్ట్‌కు ముందు కోచ్ గంభీర్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. రోహిత్ (Rohit Sharma), కోహ్లీ (Virat Kohli), బుమ్రా వంటి సీనియర్లకు షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకున్నాడట.
న్యూజిలాండ్‌తో మూడో టెస్ట్ నవంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఈ టెస్ట్ మ్యాచ్‌లో గెలిస్తేనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ చేరే అవకాశాలు మెరుగుపడతాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 30, 31 తేదీల్లో ఆటగాళ్లకు ట్రైనింగ్ సెషన్లు (Training session) నిర్వహించనున్నారు. సాధారణంగా ఇలాంటి ట్రైనింగ్ సెషన్లు కోహ్లీ, బుమ్రా, రోహిత్ వంటి సీనియర్ ఆటగాళ్లకు ఆప్షనల్‌గా ఉంటాయి. ట్రైనింగ్ సెషన్లలో వాళ్లు గాయపడితే ఇబ్బంది ఎదురవుతుందనే ఉద్దేశంతో వారికి విశ్రాంతి ఇస్తారు. ఆ సమయంలో ఆయా సీనియర్ ఆటగాళ్లు తమ వ్యక్తిగత పనులు చేసుకుంటారు.
తొలి రెండు టెస్ట్‌ల్లోనూ ఘోరంగా విఫలమైన కారణంగా ఈ ఆప్షనల్‌ను తీసేసి ప్రతి ఆటగాడు ట్రైనింగ్ సెషన్‌కు హాజరు కావాల్సిందేనని గంభీర్ నిర్ణయించాడట. ఈ ట్రైనింగ్ సెషన్‌కు కోహ్లీ, రోహిత్, బుమ్రా కూడా హాజరుకావాల్సిందేనని మేనేజ్‌మెంట్ స్పష్టం చేసింది. అక్టోబర్ 30, 31 తేదీల్లో జరిగే ట్రైనింగ్ సెషన్‌కు తప్పకుండా హాజరు కావాల్సిందేనని టాప్ ఆటగాళ్లకు కూడా ఆదేశాలు వెళ్లినట్టు క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Oct 27 , 2024 | 11:50 AM