ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rohit Sharma: మా బ్యాటింగ్‌పై చర్చ జరగాల్సిందే.. మ్యాచ్ ఓటమిపై రోహిత్ వ్యాఖ్యలు!

ABN, Publish Date - Aug 05 , 2024 | 07:19 PM

శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా ప్రదర్శన చాలా మందిని షాక్‌కు గురి చేస్తోంది. టీ20 సిరీస్‌ను వైట్ వాష్ చేసిన టీమిండియా వన్డే సిరీస్‌లో మాత్రం తడబడుతోంది. తొలి వన్డే టైగా ముగియగా, రెండో వన్డేలో శ్రీలంక విజయం సాధించింది.

Rohit Sharma

శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా (India vs SriLanka) ప్రదర్శన చాలా మందిని షాక్‌కు గురి చేస్తోంది. టీ20 సిరీస్‌ను వైట్ వాష్ చేసిన టీమిండియా వన్డే సిరీస్‌లో మాత్రం తడబడుతోంది. తొలి వన్డే టైగా ముగియగా, రెండో వన్డేలో శ్రీలంక విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన 241 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. అద్భుతమైన ఆరంభం లభించినా మిడిలార్డర్ వైఫల్యం భారత్‌ను దెబ్బ తీసింది. తమ బ్యాటింగ్ తీరుపై మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మాట్లాడాడు.


``మ్యాచ్ ఓడిపోయినపుడు బాధపడడం సహజమే. దూకుడుగా ఆడడంలో మేం విఫలమయ్యాం. వన్డే మ్యాచ్‌లో 10 ఓవర్లు మాత్రమే నిలకడగా ఆడితే సరిపోదు. నేను ఆడినపుడు కాస్త రిస్కీ షాట్లు కొట్టాను. లేకపోతే మా పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. పిచ్‌ను అర్థం చేసుకుని ముందుకు వెళ్లాలి. మిడిల్ ఓవర్లలో మా బ్యాటింగ్ దారుణంగా ఉంది. ఈ మ్యాచ్ ఓటమి గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ, మా బ్యాటింగ్ గురించి కచ్చితంగా చర్చ జరగాల్సిందేన``ని రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు.


241 పరుగుల లక్ష్య సాధనలో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు మెరుపు ఆరంభాన్ని అందించారు. 13 ఓవర్లకు 95/0తో పటిష్ట స్థితిలో నిలిచింది. ఇలాంటి స్థితిలో ఉన్న టీమిండియా ఓడిపోతుందని ఎవ్వరూ అనుకోరు. అయితే శ్రీలంక బౌలర్ వాండర్సే 6 వికెట్లు తీసి భారత్ పతనాన్ని శాసించాడు. ఫలితంగా 32 పరుగుల తేడాతో టీమిండియా ఓడిపోయింది.

ఇవి కూడా చదవండి..

Olympics 2024: శభాష్‌.. శ్రీజేష్‌


సెమీస్‌లో రోహిదాస్‌ ఆడేనా?


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 05 , 2024 | 07:19 PM

Advertising
Advertising
<