ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rohit Sharma: కోహ్లీ ఫామ్‌ గురించి రోహిత్ అదిరిపోయే ఆన్సర్.. ఫైనల్లో అదే జరుగుతుందున్న కెప్టెన్!

ABN, Publish Date - Jun 28 , 2024 | 10:42 AM

ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. పదేళ్ల తర్వాత తొలిసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. బౌలర్లు, బ్యాట్స్‌మెన్ అందరూ సమష్టిగా రాణిస్తూ విజయాలు అందిస్తున్నారు. అయితే స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ఫామ్ మాత్రమే అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది.

Rohit Sharma

ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌ (T20 Worldcup)లో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. పదేళ్ల తర్వాత తొలిసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్‌ (T20 Worldcup Final)లోకి అడుగుపెట్టింది. బౌలర్లు, బ్యాట్స్‌మెన్ అందరూ సమష్టిగా రాణిస్తూ విజయాలు అందిస్తున్నారు. అయితే స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఫామ్ మాత్రమే అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు కోహ్లీ పెద్దగా రాణించలేదు. గురువారం ఇంగ్లండ్‌తో (India vs England) జరిగిన సెమీస్ అనంతరం విరాట్ కోహ్లీ ఫామ్ గురించి రోహిత్ (Rohit Sharma) స్పందించాడు.


``చాలా మంది కోహ్లీ ఫామ్ గురించి మాట్లాడుతున్నారు. కోహ్లీ వంటి క్లాస్ ప్లేయర్‌కు ఫామ్ పెద్ద సమస్య కాదు. పదిహేనేళ్లుగా అతడితో కలిసి ఆడుతున్నాను. అతడు అద్భుతమైన క్లాస్ ప్లేయర్. ఫైనల్ మ్యాచ్‌లో కోహ్లీ ఆడతాడనడంలో ఇలాంటి సందేహమూ అక్కర్లేదు. ఫైనల్‌లో మ్యాచ్ కోహ్లీ భారీ ఇన్నింగ్స్ ఆడడం ఖాయం. అతడిపై అందరికీ నమ్మకం ఉంది`` అని రోహిత్ వ్యాఖ్యానించాడు. అలాగే ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన బౌలర్లపై ప్రశంసలు కురపించాడు.


``చాలా సంతృప్తిని కలిగించిన విజయం ఇది. ఈ విజయం చాలా రోజులు గుర్తిండిపోతుంది. పరిస్థితులకు తగినట్టు మారి సాధించిన విజయం ఇది. మేం 150కి మించి పరుగులు చేయలేమని ఓ దశలో అనిపించింది. కానీ, లోయర్ ఆర్డర్ కారణంగా విలువైన పరుగులు చేశాం. ఇక, ఇలాంటి పిచ్‌పై అక్షర్ పటేల్, కులదీప్ లాంటి స్పిన్నర్లను ఎదుర్కోవడం కష్టం. లైన్ అండ్ లెంగ్త్‌కు కట్టుబడి బంతులేస్తే వికెట్లు వస్తాయని అనుకున్నాం. మా బౌలర్లు అలాగే చేశార``ని రోహిత్ పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి..

T20 Worldcup: ఇంగ్లండ్‌తో విజయం అనంతరం రోహిత్ శర్మ కన్నీళ్లు.. విరాట్ కోహ్లీ ఏం చేశాడో చూడండి..


నాకంటే వెయ్యి రెట్లు ఉత్తమం


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 28 , 2024 | 10:42 AM

Advertising
Advertising