Olympic Games: పతకం నెగ్గితే.. రూ. 42 లక్షలు..
ABN, Publish Date - Apr 11 , 2024 | 10:32 AM
పారిస్ ఒలింపిక్స్(Paris Olympic Games) ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో మంటలు రేపే అథ్లెట్లకు కాసుల వర్షం కురవనుంది. ఈ క్రీడల్లో స్వర్ణం సాధించిన అథ్లెట్‌కు(Athletes) సుమారు 42 లక్షల (50 వేల డాలర్లు) ప్రైజ్‌మనీని(Prize money) ప్రకటిస్తూ వరల్డ్ అథ్లెటిక్స్ (డబ్ల్యూఏ) సంచలన నిర్ణయం తీసుకొంది. మెగా ఈవెంట్‌లో ట్రాక్ అండ్ ఫీల్డ్‌కు సంబంధించిన 48 క్రీడాంశాల్లో..
మొనాకో: పారిస్ ఒలింపిక్స్(Paris Olympic Games) ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో మంటలు రేపే అథ్లెట్లకు కాసుల వర్షం కురవనుంది. ఈ క్రీడల్లో స్వర్ణం సాధించిన అథ్లెట్‌కు(Athletes) సుమారు 42 లక్షల (50 వేల డాలర్లు) ప్రైజ్‌మనీని(Prize money) ప్రకటిస్తూ వరల్డ్ అథ్లెటిక్స్ (డబ్ల్యూఏ) సంచలన నిర్ణయం తీసుకొంది. మెగా ఈవెంట్‌లో ట్రాక్ అండ్ ఫీల్డ్‌కు సంబంధించిన 48 క్రీడాంశాల్లో పసిడి పతకాలు నెగ్గిన వారికి మాత్రమే ఈ నజరానా అందనుంది. ఇక.. 2028 ఒలింపిక్స్‌లో రజత, కాంస్య పతకాలు సాధించిన వారికి కూడా ప్రైజ్‌మనీ దక్కనుందని డబ్ల్యూఏ బుధవారం తెలిపింది. కాగా రిలే అథ్లెట్లకు ప్రైజ్‌మనీని సమానంగా పంచనున్నారు.
మరిన్ని స్పోర్ట్స్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
Updated Date - Apr 11 , 2024 | 10:32 AM