ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Cricket: ఒక ఓవర్‌లో 7 సిక్సులు.. భారత బ్యాట్స్‌మెన్ సంచలనం..

ABN, Publish Date - Oct 03 , 2024 | 04:11 PM

Cricket Records: క్రికెట్‌లోని ఏ ఫార్మాట్‌లోనైనా నిబంధనల ప్రకారం.. ఒక ఓవర్‌లో 6 బంతులు ఉంటాయి. ఒక్కో బంతికి గరిష్టంగా సిక్స్ కొట్టే అవకాశం ఉంటుంది. అంటే ఒక ఓవర్‌లో గరిష్టంగా ఆరు బంతులకు 6 సిక్సులు కొట్టొచ్చు. కానీ, ఒకే ఓవర్‌లో వరుసగా 7 సిక్సర్లు కొట్టడం ఎప్పుడైనా చూశారా? ఈ అరుదైన రికార్డును భారత బ్యాట్స్‌మెన్ సృష్టించాడు.

Cricket News

Cricket Records: క్రికెట్‌లోని ఏ ఫార్మాట్‌లోనైనా నిబంధనల ప్రకారం.. ఒక ఓవర్‌లో 6 బంతులు ఉంటాయి. ఒక్కో బంతికి గరిష్టంగా సిక్స్ కొట్టే అవకాశం ఉంటుంది. అంటే ఒక ఓవర్‌లో గరిష్టంగా ఆరు బంతులకు 6 సిక్సులు కొట్టొచ్చు. కానీ, ఒకే ఓవర్‌లో వరుసగా 7 సిక్సర్లు కొట్టడం ఎప్పుడైనా చూశారా? ఈ అరుదైన రికార్డును భారత బ్యాట్స్‌మెన్ సృష్టించాడు. ఒక ఓవర్‌లో 7 సిక్సర్లు కొట్టి ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అద్భుతం సృష్టించాడు. మరి ఇంతకీ ఆ క్రికెటర్ ఎవరు? ఏ మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు? పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం..


విధ్వంసకర బ్యాటింగ్..

భారత ఏస్ బ్యాట్స్‌మెన్ రితురాజ్ గైక్వాడ్ 2022 నవంబర్ 28న క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. క్రికెట్‌లో తొలిసారిగా ఓవర్‌లో వరుసగా 7 సిక్సర్లు కొట్టాడు. దేశవాళీ క్రికెట్‌ విజయ్ హజారే ట్రోఫీ టోర్నమెంట్‌లో మహారాష్ట్ర తరఫున ఆడిన గైక్వాడ్.. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఈ ప్రత్యేకమైన ఫీట్ సాధించాడు. విజయ్ హజారే ట్రోఫీ క్వార్టర్-ఫైనల్ మ్యాచ్ 28 నవంబర్ 2022న మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ మధ్య జరిగింది.


క్రికెట్ చరిత్రలో తొలిసారిగా అరుదైన రికార్డు..

మహారాష్ట్ర టీమ్ తరఫున గైక్వాడ్ బ్యాటింగ్ చేస్తుండగా.. ఉత్తరప్రదేశ్ టీమ్ నుంచి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శివ సింగ్ బౌలింగ్ చేశాడు. శివసింగ్ తన ఓవర్‌లో 1 నో బాల్ సహా మొత్తం 7 బంతులు వేశాడు. అయితే, గైక్వాడ్ ఈ ఏడు బంతులను బౌండరీ దాటించాడు. వరుసగా బంతికొకటి చొప్పున 7 సికర్సర్లు బాదేశాడు. దీంతో ఈ ఒక్క ఓవర్‌లోనే గైక్వాడ్ 43 పరుగులు సాధించాడు.


159 బంతుల్లో 220 పరుగులు..

ఉత్తరప్రదేశ్‌తో జరిగిన ఈ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో రితురాజ్ గైక్వాడ్ 159 బంతుల్లో 220 పరుగులతో అజేయంగా నిలిచాడు. మొత్తం 10 ఫోర్లు, 16 సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు. రితురాజ్ గైక్వాడ్ భారత్ తరఫున 6 వన్డేలు, 23 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. వన్డేల్లో 115 పరుగులు, టీ20లో 633 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా ఉన్నాడు. 66 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలతో కలిపి మొత్తం 2,380 పరుగులు చేశాడు.


Also Read:

గూగుల్ పే నుంచి క్షణాల్లోనే రూ. 50 లక్షల లోన్స్...

కోహ్లీకి కొత్త రూల్స్ నేర్పించిన అనుష్క..

అన్నీ త్వరలోనే కక్కిస్తా..

For More Sports News and Telugu News..

Updated Date - Oct 03 , 2024 | 04:11 PM