ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Olympics 2024: శభాష్‌.. శ్రీజేష్‌

ABN, Publish Date - Aug 05 , 2024 | 05:10 AM

ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు వరుసగా రెండోసారి సెమీ్‌సలో అడుగుపెట్టింది. ఆదివారం గ్రేట్‌ బ్రిటన్‌తో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన క్వార్టర్స్‌ షూటౌట్‌కు దారి తీయగా 4-2తో హర్మన్‌ప్రీత్‌ సేన...

హాకీ సెమీస్‌కు భారత్‌

  • షూటౌట్‌లో అడ్డుగోడలా గోల్‌ కీపర్‌

  • క్వార్టర్స్‌లో గ్రేట్‌ బ్రిటన్‌పై విజయం

పారిస్‌ ఒలింపిక్స్‌లో తొమ్మిదోరోజు హాకీ వీరులు మినహా బరిలోకి దిగిన మిగతా క్రీడాకారులంతా నిరాశపరిచారు. బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో ఫైనల్‌ చేరతాడనుకున్న లక్ష్యసేన్‌ సెమీఫైనల్లో టాప్‌సీడ్‌ విక్టర్‌ అక్సెల్‌సెన్‌ చేతిలో ఓటమి పాలయ్యాడు. ఇక అతని ఆశలన్నీ సోమవారం జరిగే కాంస్య పతకపోరుపైనే. లవ్లీనా క్వార్టర్స్‌ను దాటకపోవడంతో బాక్సింగ్‌లో మన పరాజయం పరిపూర్ణమవగా.. షూటింగ్‌లో మరిన్ని పతకాలపై ఆశలు రేపిన మహేశ్వరి, విజయ్‌వీర్‌, అనీష్‌ తమ విభాగాల్లో ఫైనల్స్‌ చేరడంలో విఫలమయ్యారు.


పారిస్‌: ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు వరుసగా రెండోసారి సెమీ్‌సలో అడుగుపెట్టింది. ఆదివారం గ్రేట్‌ బ్రిటన్‌తో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన క్వార్టర్స్‌ షూటౌట్‌కు దారి తీయగా 4-2తో హర్మన్‌ప్రీత్‌ సేన విజయం సాధించింది. నిర్ణీత సమయానికి ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. అర్జెంటీనా-జర్మనీ మధ్య జరిగే క్వార్టర్స్‌ మ్యాచ్‌ విజేతతో భారత్‌ సెమీస్‌ను మంగళవారం ఆడనుంది. కాగా 2020 టోక్యో ఒలింపిక్స్‌లో క్వార్టర్‌ఫైనల్లోనూ భారత జట్టు 3-1తో బ్రిటన్‌ను ఓడించి సెమీ్‌సకు చేరింది. ఇప్పుడు మరోసారి అదే జట్టుపై గెలవడం విశేషం. కాగా ఈ మ్యాచ్‌లో ఆఖరి 40 నిమిషాల పాటు భారత జట్టు కేవలం 10 మందితోనే ఆడినా ప్రత్యర్థిని మరో గోల్‌ చేయనీ యకుండా అడ్డుకోగలిగింది. ఇందుకు జట్టు గోల్‌కీపర్‌ శ్రీజేష్‌ చూపిన అసాధారణ ఆటతీరే కారణం. మ్యాచ్‌లోనూ, షూటౌట్‌లోనూ అతడు బ్రిటన్‌కు అడ్డుగోడలా నిలిచి శభాష్‌ అనిపించుకున్నాడు. కెరీర్‌లో చివరి ఒలింపిక్స్‌ ఆడుతున్న అతను బ్రిటన్‌ నుంచి ఎదురైన 11 షాట్లను సమర్థవంతంగా అడ్డుకోకపోయుంటే ఈమ్యాచ్‌లో భారత్‌ ఓడేదేమో. రెండో క్వార్టర్‌లో డిఫెండర్‌ అమిత్‌ రోహి


దాస్‌ హాకీ స్టిక్‌తో ప్రత్యర్థి ముఖంపై కొట్టాడనే కారణంతో రెడ్‌ కార్డుకు గురై మైదానం వీడాడు. అయినా కాసేపటికే హర్మన్‌ (22వ నిమిషం) గోల్‌ చేయడంతో జట్టు 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ మరో ఐదు నిమిషాలకే బ్రిటన్‌ ఆటగాడు మోర్టాన్‌ గోల్‌ చేయడంతో స్కోరు సమమైంది. ఆ తర్వాత ఇరుజట్ల నుంచి గోల్‌ నమోదు కాలేదు. దీంతో షూటౌట్‌ తప్పలేదు. ఇందులో భారత్‌ నుంచి హర్మన్‌, సుఖ్‌జీత్‌, లలిత్‌, రాజ్‌ కుమార్‌ వరుసగా గోల్స్‌ చేయగా.. బ్రిటన్‌కు కీపర్‌ శ్రీజేష్‌ అడ్డుగా నిలవడంతో రెండు గోల్స్‌ మాత్రమే చేసి ఓడింది. ఇక, ఈ మ్యాచ్‌ లో శ్రీజేష్‌ ఆటతీరు నెట్టింట ప్రశంసలు అందుకుంటోంది. నీవే రియల్‌ హీరో అంటూ కొనియాడుతున్నారు.


పతకాల పట్టిక

దేశం

స్వర్ణం

రజతం

కాంస్యం

మొత్తం

భారత్‌

0

0

3

3

చైనా

19

15

11

45

అమెరికా

18

26

25

69

ఫ్రాన్స్‌

12

14

18

44

ఆస్ట్రేలియా

12

10

7

29

బ్రిటన్‌

10

12

15

37

కొరియా

10

7

7

24

జపాన్‌

8

5

10

23

ఇటలీ

7

9

5

21

నెదర్లాండ్స్‌

6

5

4

15

జర్మనీ

5

5

2

12

Updated Date - Aug 05 , 2024 | 01:48 PM

Advertising
Advertising
<