ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sania Mirza-Shoaib Malik: దుబాయ్‌లో సానియా-షోయబ్.. విడాకుల తర్వాత ఫస్ట్ టైమ్

ABN, Publish Date - Nov 01 , 2024 | 01:11 PM

పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో విడాకుల తర్వాత ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడుపుతోంది సానియా మీర్జా. కొడుకు భవిష్యత్తును తీర్చిదిద్దే పనుల్లో ఆమె బిజీగా ఉంది.

Sania Mirza- Shoaib Malik

భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఆటకు గుడ్‌బై చెప్పినా ఏదో ఒక విధంగా ఆమె పేరు న్యూస్‌లో నానుతూనే ఉంటుంది. పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్‌తో విడాకుల వ్యవహారంతో ఆ మధ్య వైరల్‌గా మారింది సానియా. డివోర్స్ వల్ల కాస్త డిస్ట్రబ్ అయిన ఆమె ఇప్పుడు ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడుపుతోంది. అలాంటిది చాన్నాళ్ల తర్వాత సానియా-షోయబ్ దుబాయ్‌లో దర్శనమివ్వడం ఆసక్తికరంగా మారింది. విడాకుల తర్వాత మళ్లీ కలవడం ఇదే ఫస్ట్ టైమ్ కావడంతో అంతా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. అసలేం జరిగిందనేది ఇప్పుడు చూద్దాం..



గ్రాండ్‌గా కుమారుడి బర్త్ డే

సానియా కుమారుడు ఇజహాన్ ఆరో పడిలోకి అడుగుపెట్టాడు. తాను అల్లారుముద్దుగా చూసుకుంటున్న కొడుకు పుట్టిన రోజును టెన్నిస్ లెజెండ్ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసింది. ఆ తర్వాత బర్త్‌డే ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘చిన్నారి బాబు.. నీకు ఆరేళ్లు అంటే నమ్మలేకపోతున్నా. నా నవ్వుకు నువ్వే కారణం. హ్యాపీ బర్త్‌డే లడ్డూ’ అని సానియా ఇన్‌స్టా పోస్ట్‌లో రాసుకొచ్చింది. సానియాతో పాటు షోయబ్ మాలిక్ కూడా కొడుకు ఇజహాన్ పుట్టిన రోజును దుబాయ్‌లో ఘనంగా సెలబ్రేట్ చేశాడు. కుమారుడితో కలసి కేక్ కట్ చేసిన వీడియోను పాక్ క్రికెటర్ అభిమానులతో పంచుకున్నాడు. సానియా-షోయబ్ దుబాయ్‌లోనే ఉన్నా ఇజహాన్ బర్త్‌డేను వేర్వేరుగా సెలబ్రేట్ చేసుకోవడం గమనార్హం.


వేర్వేరుగా..

షోయబ్ మాలిక్ దుబాయ్‌కు రావడంతో సానియాతో అతడు కలసిపోయాడని చాలా మంది అనుకున్నారు. కానీ సోషల్ మీడియా పోస్ట్‌ల్లో ఇద్దరూ వేర్వేరుగా కొడుకు పుట్టిన రోజును జరుపుకోవడం చూసి నిరాశకు లోనయ్యారు. కాగా, షోయబ్‌తో విడాకుల తర్వాత ఫ్యామిలీతో ఎక్కువ టైమ్ గడుపుతోంది సానియా. అయినా ఆమె మీద ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంది. ఒక టీమిండియా క్రికెటర్‌ను ఆమె పెళ్లి చేసుకోబోతోందని, త్వరలోనే రాజకీయాల్లోకి వస్తుందని.. ఇలా తరచూ ఏదో ఒక గాసిప్ వినిపిస్తోంది. అయితే ఈ టెన్నిస్ బ్యూటీ మాత్రం వాటిని కేర్ చేయడం లేదు.

ఇది కూడా చదవండి:

Virat Kohli: నా నెక్స్ట్ గోల్ అదే.. దాని కోసమే పోరాటం: కోహ్లీ

India vs New Zealand: మొదలైన ముంబై టెస్ట్.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే

మరిన్ని క్రీడా వార్తల కోసం

Updated Date - Nov 01 , 2024 | 01:11 PM