ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సంజూ.. అంతా తానై

ABN, Publish Date - Nov 09 , 2024 | 06:04 AM

టీ20 ఫార్మాట్‌లో సంజూ శాంసన్‌ (50 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్సర్లతో 107) తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. దక్షిణాఫ్రికా బౌన్సీ పిచ్‌లపై సైతం ఎలాంటి బెదురు లేకుండా మెరుపు శతకంతో మెరిశాడు. అతడికి తోడు స్పిన్నర్లు వరుణ్‌ చక్రవర్తి (3/25), రవి

సంజూ శాంసన్‌ (50 బంతుల్లో 107)

47 బంతుల్లో మెరుపు శతకం

భారత్‌ ఘన విజయం

దక్షిణాఫ్రికాతో తొలి టీ20

డర్బన్‌: టీ20 ఫార్మాట్‌లో సంజూ శాంసన్‌ (50 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్సర్లతో 107) తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. దక్షిణాఫ్రికా బౌన్సీ పిచ్‌లపై సైతం ఎలాంటి బెదురు లేకుండా మెరుపు శతకంతో మెరిశాడు. అతడికి తోడు స్పిన్నర్లు వరుణ్‌ చక్రవర్తి (3/25), రవి బిష్ణోయ్‌ (3/28) సుడులు తిరిగే బంతులతో ప్రత్యర్థిని స్వల్ప స్కోరుకే కట్టడి చేశారు. దీంతో శుక్రవారం సఫారీలతో జరిగిన తొలి టీ20లో భారత్‌ 61 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఆదివారం రెండో మ్యాచ్‌ జరుగుతుంది. మరోవైపు శాంసన్‌కిది వరుసగా రెండో టీ20 సెంచరీ కావడం విశేషం. తన చివరి మ్యాచ్‌ (బంగ్లాతో)లోనూ అతడు మూడంకెల స్కోరు సాధించాడు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 202 పరుగులు చేసింది. తిలక్‌ వర్మ (18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 33), సూర్యకుమార్‌ (17 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 21) రాణించారు. పేసర్‌ కొట్జీకి మూడు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో దక్షిణాఫ్రికా 17.5 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌటైంది. క్లాసెన్‌ (25), కొట్జీ (23), రికెల్టన్‌ (21) మాత్రమే రాణించారు. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా శాంసన్‌ నిలిచాడు.

హోరెత్తించాడు..: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్‌ సంజూ శాంసన్‌ అదిరిపోయే ఆరంభాన్నిచ్చాడు. బౌలర్‌ ఎవరైనా హిట్టింగ్‌ను మాత్రం ఆపలేదు. భారీ షాట్లతో కింగ్స్‌మీడ్‌ను హోరెత్తిస్తూ అంతా తానై పరుగుల వరద పారించాడు. కానీ తను వెనుదిరిగాక మాత్రం భారత్‌ తడబడింది. చివరి ఆరు ఓవర్లలో సఫారీ బౌలర్లు 40 పరుగులే ఇచ్చి ఆరు వికెట్లు తీయగా జట్టు ఆశించిన భారీ స్కోరు సాధించలేకపోయింది. మూడో ఓవర్‌లో శాంసన్‌ వరుసగా 4,6తో ఎదురుదాడికి తెర లేపాడు. అటు మరో ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (7) తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తూ నాలుగో ఓవర్‌లోనే వెనుదిరిగాడు. కెప్టెన్‌ సూర్య వచ్చీరాగానే 4,6తో ఆకట్టుకున్నాడు. అలాగే ఐదో ఓవర్‌లో శాంసన్‌ 4,6 సూర్య 4తో 15 రన్స్‌ వచ్చాయి. ఇక ఆరో ఓవర్‌లో సంజూ మరో సిక్సర్‌తో పవర్‌ప్లేలో జట్టు 56/1 స్కోరుతో నిలిచింది. ఆ తర్వాత కూడా పరుగుల వేగం మరింత పెరిగిందే కానీ తగ్గలేదు. లెగ్‌ స్పిన్నర్‌ పీటర్‌ ఓవర్‌లో రెండు వరుస సిక్సర్లతో 27 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేశాడు. అయితే తొమ్మిదో ఓవర్‌లో సూర్య అవుట్‌ కావడంతో రెండో వికెట్‌కు 66 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత ‘బర్త్‌డే బాయ్‌’ తిలక్‌ వర్మ అండతో శాంసన్‌ మరింతగా చెలరేగాడు. ఇద్దరూ పోటాపోటీ బౌండరీలతో స్కోరు రాకెట్‌ వేగంతో దూసుకెళ్లింది. అటు 13వ ఓవర్‌లో సంజూ 4,4,6 బాదగా, తర్వాతి ఓవర్‌లోనే తిలక్‌ 4,6తో చెలరేగాడు. ఇక 47 బంతుల్లోనే శాంసన్‌ వరుసగా రెండో సెంచరీతో సంబరాలు చేసుకున్నాడు. అయితే 15వ ఓవర్‌లో ఫోర్‌ బాదిన వెంటనే తిలక్‌ను కేశవ్‌ అవుట్‌ చేయగా.. 16వ ఓవర్‌లో సిక్సర్‌ బాదిన వెంటనే శాంసన్‌ను పీటర్‌ పెవిలియన్‌కు చేర్చడంతో మూడో వికెట్‌కు 77 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత పేసర్‌ కొట్జీ కట్టడి చేస్తూ హార్దిక్‌ (2), రింకూ (11) వికెట్లను తీయడంతో భారత్‌ పరుగుల వేగం తగ్గింది. ఆఖరి ఓవర్‌లో మరో రెండు వికెట్లు కోల్పోయిన జట్టు 200 పరుగులు దాటగలిగింది.

దెబ్బతీసిన స్పిన్నర్లు: భారీ ఛేదనలో ఆరంభం నుంచే దక్షిణాఫ్రికా వెనుకబడింది. తొలి ఓవర్‌లోనే కెప్టెన్‌ మార్‌క్రమ్‌ (8)ను పేసర్‌ అర్ష్‌దీప్‌ అవుట్‌ చేయగా, ఏ దశలోనూ లక్ష్యం వైపు సాగలేదు. స్పిన్నర్లు వరుణ్‌ చక్రవర్తి, బిష్ణోయ్‌ తమ మ్యాజిక్‌ బంతులతో మిడిలార్డర్‌ను దెబ్బతీశారు. ఓపెనర్‌ రికెల్టన్‌, స్టబ్స్‌ (11) సైతం పవర్‌ప్లేలోనే వెనుదిరగడంతో కష్టాలు మరింత పెరిగాయి. అయితే క్లాసెన్‌, మిల్లర్‌ (18) క్రీజులో ఉండడంతో గట్టి పోటీ ఇస్తారనుకున్నా వారి నుంచి మెరుపులే కరువయ్యాయి. ఈ ఇద్దరినీ వరుణ్‌ 12వ ఓవర్‌లో అవుట్‌ చేయగా.. తర్వాతి ఓవర్‌లోనే బిష్ణోయ్‌ మరో రెండు వికెట్లు తీశాడు. దీంతో 93/7 స్కోరుతో సౌతాఫ్రికా విజయానికి అందనంత దూరంలో నిలిచింది. టెయిలెండర్లలో కొట్జీ సిక్సర్లతో చెలరేగినా 17వ ఓవర్‌లో సూర్య సూపర్‌త్రోతో రనౌటయ్యాడు. అప్పటికి 18 బంతుల్లో 68 పరుగులు చేయాల్సి ఉండడంతో సఫారీలకు పరాభవం తప్పలేదు.


భారత్‌ తరఫున టీ20ల్లో వరుసగా రెండు శతకాలు సాధించిన బ్యాటర్‌గా సంజూ శాంసన్‌. ఓవరాల్‌గా గుస్తావ్‌ మెకాన్‌ (ఫ్రాన్స్‌), ఫిల్‌ సాల్ట్‌, రోసో కూడా ఈ ఫీట్‌ సాధించారు.

భారత్‌ తరఫున ఓ టీ20 మ్యాచ్‌లో ఎక్కువ సిక్సర్లు (10) బాదిన ప్లేయర్‌గా రోహిత్‌తో సమంగా నిలిచిన శాంసన్‌.

స్కోరుబోర్డు

భారత్‌: శాంసన్‌ (సి) స్టబ్స్‌ (బి) పీటర్‌ 107; అభిషేక్‌ (సి) మార్‌క్రమ్‌ (బి) కొట్జీ 7; సూర్యకుమార్‌ (సి) సిమెలానె (బి) క్రుగెర్‌ 21; తిలక్‌ వర్మ (సి) జాన్సెన్‌ (బి) కేశవ్‌ 33; హార్దిక్‌ (సి) జాన్సెన్‌ (బి) కొట్జీ 2; రింకూ (సి) క్లాసెన్‌ (బి) కొట్జీ 11; అక్షర్‌ (సి) స్టబ్స్‌ (బి) జాన్సెన్‌ 7; అర్ష్‌దీప్‌ (నాటౌట్‌) 5; బిష్ణోయ్‌ (రనౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 20 ఓవర్లలో 202/8. వికెట్ల పతనం: 1-24, 2-90, 3-167, 4-175, 5-181, 6-194, 7-199, 8-202. బౌలింగ్‌: జాన్సెన్‌ 4-0-24-1; మార్‌క్రమ్‌ 1-0-10-0; కేశవ్‌ 4-0-34-1; కొట్జీ 4-0-37-3; పీటర్‌ 3-0-35-1; క్రుగెర్‌ 2-0-35-1; సిమెలానె 2-0-27-0.

దక్షిణాఫ్రికా: మార్‌క్రమ్‌ (సి) సంజూ (బి) అర్ష్‌దీప్‌ 8, రికెల్టన్‌ (సి) తిలక్‌ (బి) వరుణ్‌ 21; స్టబ్స్‌ (సి) సూర్య (బి) అవేశ్‌ 11; క్లాసెన్‌ (సి) అక్షర్‌ (బి) వరుణ్‌ 25; మిల్లర్‌ (సి) అవేశ్‌ (బి) వరుణ్‌ 18; క్రూగర్‌ (సి) హార్దిక్‌ (బి) రవి 1; జాన్సెన్‌ (సి) హార్దిక్‌ (బి) రవి 12; సిమెలానె (ఎల్బీ) రవి 6; కొట్జీ (రనౌట్‌) 23; కేశవ్‌ (బి) అవేశ్‌ 5; పీటర్‌ (నాటౌట్‌) 5; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 17.5 ఓవర్లలో 141 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-8; 2-30; 3-44; 4-86; 5-87; 6-87; 7-93; 8-114; 9-135; 10-141; బౌలింగ్‌: అర్ష్‌దీప్‌ 3-0-25-1; అవేశ్‌ 2.5-0-28-2; హార్దిక్‌ 3-0-27-0; వరుణ్‌ చక్రవర్తి 4-0-25-3; రవి బిష్ణోయ్‌ 4-0-28-3; అక్షర్‌ 1-0-8-0.

Updated Date - Nov 09 , 2024 | 06:04 AM