ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

టాప్‌షోతో సిరీస్‌

ABN, Publish Date - Dec 25 , 2024 | 04:32 AM

భారత మహిళల జట్టు భీకర ఫామ్‌ను కొనసాగిస్తోంది. వెస్టిండీ్‌సతో మంగళవారం జరిగిన రెండో వన్డేలోనూ టాపార్డర్‌ బ్యాటర్లు కదం తొక్కడంతో వన్డేల్లో తమ అత్యధిక స్కోరును సమం చేసింది. హర్లీన్‌ డియోల్‌ (115) కెరీర్‌లో తొలి శతకం బాదగా...

హర్లీన్‌ శతకం

భారత్‌ రికార్డు స్కోరు

మాథ్యూస్‌ సెంచరీ వృథా

రెండో వన్డేలో విండీస్‌ చిత్తు

వడోదర: భారత మహిళల జట్టు భీకర ఫామ్‌ను కొనసాగిస్తోంది. వెస్టిండీ్‌సతో మంగళవారం జరిగిన రెండో వన్డేలోనూ టాపార్డర్‌ బ్యాటర్లు కదం తొక్కడంతో వన్డేల్లో తమ అత్యధిక స్కోరును సమం చేసింది. హర్లీన్‌ డియోల్‌ (115) కెరీర్‌లో తొలి శతకం బాదగా, ఓపెనర్లు ప్రతీక రావల్‌ (76), స్మృతి మంధాన (53), జెమీమా (52) అర్ధసెంచరీలతో రాణించారు. దీంతో భారత్‌ 115 పరుగుల తేడాతో నెగ్గి మరో మ్యాచ్‌ ఉండగానే సిరీ్‌సను 2-0తో దక్కించుకున్నట్టయ్యింది. ముందుగా భారత్‌ 50 ఓవర్లలో 5 వికెట్లకు 358 పరుగులు చేసింది. గతంలో ఐర్లాండ్‌పై కూడా ఇన్నే పరుగులు సాధించి రికార్డు నెలకొల్పింది. ఈ ఫార్మాట్‌లో మహిళల జట్టు 350+ స్కోర్లు చేయడం ఇది రెండోసారి. అద్భుత ఫామ్‌లో ఉన్న మంధాన.. ప్రతీకతో కలిసి తొలి వికెట్‌కు 110 పరుగులు జత చేసింది.


ఆ తర్వాత హర్లీన్‌ సెంచరీతో ఎదురుదాడికి దిగడంతో పాటు జెమీమాతో కలిసి నాలుగో వికెట్‌కు 116 పరుగులు జత చేయడం విశేషం. భారీ ఛేదనలో విండీస్‌ కెప్టెన్‌ హేలీ మాథ్యూస్‌ (106) సైతం శతకంతో పోరాడినా.. 46.2 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటైంది. ప్రియాకు మూడు.. ప్రతీక, దీప్తి, టిటా్‌సలకు రెండేసి వికెట్లు దక్కాయి.

సంక్షిప్త స్కోర్లు

భారత్‌: 50 ఓవర్లలో 358/5 (హర్లీన్‌ 115, ప్రతీక 76, మంధాన 53, జెమీమా 52; జోసెఫ్‌ 1/27).

వెస్టిండీస్‌: 46.2 ఓవర్లలో 243 ఆలౌట్‌ (మాథ్యూస్‌ 106, క్యాంప్‌బెల్‌ 38; ప్రియా మిశ్రా 3/49, ప్రతీక 2/37).

Updated Date - Dec 25 , 2024 | 04:32 AM