ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

T20 World Cup: కష్టం, చెమటతో ఈ షర్టు కుట్టాను.. సంజూ శాంసన్ భావోద్వేగ పోస్ట్ వైరల్!

ABN, Publish Date - May 01 , 2024 | 11:48 AM

అమెరికా, వెస్టిండీస్‌ వేదికగా మరో నెల రోజుల్లో జరిగే టీ20 ప్రపంచకప్‌‌లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యంలోని 15 మంది సభ్యులతో కూడిన జట్టును సెలక్టర్లను ప్రకటించారు. వికెట్ కీపర్లుగా రిషభ్‌ పంత్‌‌తో సంజూ శాంసన్‌కు కూడా అవకాశం లభించింది.

Sanju Samson

అమెరికా, వెస్టిండీస్‌ వేదికగా మరో నెల రోజుల్లో జరిగే టీ20 ప్రపంచకప్‌‌లో (T20 World Cup) పాల్గొనే భారత జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. రోహిత్ శర్మ (Rohit Sharma) సారథ్యంలోని 15 మంది సభ్యులతో కూడిన జట్టును సెలక్టర్లను ప్రకటించారు. వికెట్ కీపర్లుగా రిషభ్‌ పంత్‌‌తో సంజూ శాంసన్‌ (Sanju Samson)కు కూడా అవకాశం లభించింది. ప్రస్తుత ఐపీఎల్‌లో (IPL 2024) అమోఘంగా రాణిస్తూ రాజస్థాన్ రాయల్స్ టీమ్‌ను నడిపిస్తున్న శాంసన్‌కు అవకాశం రావడం పట్ల ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


సీనియర్ ప్లేయర్, వికెట్ కీపింగ్ చేయగలిగే కేఎల్ రాహుల్‌ను (KL Rahul) కాదని సంజూ శాంసన్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. టీ-20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టులో తన పేరు ఉందని తెలుసుకోగానే సంజూ శాంసన్ భావోద్వేగానికి గురయ్యాడు. కేరళకు చెందిన శాంసన్ తన సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ``బోలెడంత కష్టం, చెమటతో ఈ షర్టును కుట్టాను`` అంటూ మలయాళంలో పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


నిజానికి 2015లో సంజూ శాంసన్ భారత్ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అయితే ఇన్నేళ్లలో శాంసన్‌కు వచ్చిన అవకాశాలు చాలా తక్కువ. వికెట్ కీపర్లు ధోనీ, పంత్ మెరుగ్గా రాణించడంతో శాంసన్‌కు పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే ప్రస్తుత ఐపీఎల్‌లో శాంసన్ అంచనాలకు మించి రాణిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌లో 77 సగటుతో 385 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 161కు పైగానే ఉంది. ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో శాంసన్ ఏడో స్థానంలో ఉన్నాడు. ఈ ప్రదర్శన కారణంగానే టీ-20 ప్రపంచకప్ జట్టులో శాంసన్‌కు స్థానం లభించింది.

ఇవి కూడా చదవండి..

T20 World Cup: ప్రపంచకప్‌లో రింకూ సింగ్‌కు అందుకే చోటు కల్పించలేదేమో: సునీల్ గవాస్కర్


T20 World Cup: స్టీవ్ స్మిత్‌కు నో ప్లేస్.. మిచెల్ మార్ష్‌కు కెప్టెన్సీ.. ఆస్ట్రేలియా టీ20 వరల్డ్ కప్ టీమ్ ఇదే..!


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 01 , 2024 | 11:48 AM

Advertising
Advertising