Share News

PV Sindhu : యువ వ్యాపారవేత్తతో సింధు వివాహం

ABN , Publish Date - Dec 03 , 2024 | 01:26 AM

స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు (29) త్వరలో పెళ్లిపీటలెక్కనుంది. ఈ నెల 22న యువ వ్యాపారవేత్త గౌరవెల్లి వెంకట దత్త సాయితో ఆమె వివాహం జరగనుంది.

PV Sindhu : యువ వ్యాపారవేత్తతో సింధు వివాహం

22న ఉదయ్‌పూర్‌లో పెళ్లి

హైదరాబాద్‌: స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు (29) త్వరలో పెళ్లిపీటలెక్కనుంది. ఈ నెల 22న యువ వ్యాపారవేత్త గౌరవెల్లి వెంకట దత్త సాయితో ఆమె వివాహం జరగనుంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో పెళ్లి జరగనుండగా.. 24న హైదరాబాద్‌లో రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు. ఈ నెల 20 నుంచి పెళ్లి కార్యక్రమాలు మొదలవుతాయని కుటుంబ వర్గాలు తెలిపాయి. బెంగళూరు ట్రిపుల్‌ ఐటీలో మాస్టర్స్‌ డిగ్రీ చేసిన దత్త.. హైదరాబాద్‌కు చెందిన పోసిడెక్స్‌ టెక్నాలజీ్‌సకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. అతడి తండ్రి జీటీ వెంటేశ్వరరావు అదే కంపెనీకి మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సింధు డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తోంది. గత ఏడాది కాలంగా సింధు, సాయి మధ్య పరిచయం ఉందని, గత నెలలోనే వీరి పెళ్లికి సంబంధించి ఓ నిర్ణయానికి వచ్చామని సింధు తండ్రి పీవీ రమణ తెలిపాడు.

ghj.jpg

వీరిద్దరూ కొన్ని మ్యాచ్‌లు, సినిమాలకు కలసి హాజరయ్యారు. అయితే, జనవరి నుంచి సింధుకు బిజీ షెడ్యూల్‌ ఉండడంతో.. ఈనెలలో వివాహం చేయాలని నిర్ణయించుకొన్నట్టు రమణ తెలిపాడు. రెండేళ్లుగా ఫామ్‌లోలేని సింధు గత ఆదివారం సయ్యద్‌ మోదీ అంతర్జాతీయ టోర్నీలో విజేతగా నిలిచింది. 2013లో వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప పతకంతో సింధు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత 2019లో ప్రపంచ చాంపియన్‌షి్‌పను సొంతం చేసుకొంది. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన సింధు.. 2021 టోక్యో క్రీడల్లో కాంస్యం దక్కించుకొంది. ఈ క్రమంలో విశ్వక్రీడల్లో రెండు పతకాలు సాధించిన తొలి భారత ప్లేయర్‌గా రికార్డు సృష్టించింది. 2017లో వరల్డ్‌ ర్యాంకింగ్స్‌లో తొలిసారి రెండో ర్యాంక్‌కు చేరుకొంది. 2028 ఒలింపిక్స్‌ వరకు కెరీర్‌లో కొనసాగాలని సింధు భావిస్తోంది.

Updated Date - Dec 03 , 2024 | 01:36 AM