ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Virat Kohli: ``మేం కూడా ఎంతో కొంత క్రికెట్ ఆడాం.. ఎలా మాట్లాడాలో మాకు తెలుసు``.. కోహ్లీ వ్యాఖ్యలకు గవాస్కర్ కౌంటర్!

ABN, Publish Date - May 06 , 2024 | 04:47 PM

సునీల్ గవాస్కర్, విరాట్ కోహ్లీ.. భారత్ తరఫున క్రికెట్ ఆడిన గొప్ప క్రికెటర్లు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ ఇద్దరూ తరచుగా ఒకరినకొరు విమర్శించుకుంటూ ఉండడం క్రికెట్ ప్రేమికులకు అసహనం కలిగిస్తోంది.

Sunil Gavaskar, Virat kohli

సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar), విరాట్ కోహ్లీ (Virat kohli).. భారత్ తరఫున క్రికెట్ ఆడిన గొప్ప క్రికెటర్లు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ ఇద్దరూ తరచుగా ఒకరినకొరు విమర్శించుకుంటూ ఉండడం క్రికెట్ ప్రేమికులకు అసహనం కలిగిస్తోంది. ప్రస్తుత ఐపీఎల్‌లో బెంగళూరు ఓటమికి కోహ్లీయే కారణం అంటూ సునీల్ గవాస్కర్, ఇతర మాజీలు కామెంట్లు చేశారు. కోహ్లీ నెమ్మదిగా ఆడుతుండడం వల్లే బెంగళూరు (RCB) ఓడిపోతోందని కామెంట్లు చేశారు. కామెంటేటర్లు వ్యాఖ్యలపై కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు (IPL 2024).


``చాలా మంది వ్యక్తులు నా స్ట్రైక్‌రేటు గురించి, నేను స్పిన్‌ సరిగా ఆడలేనని అంటున్నారు. కానీ నాకు జట్టుకు విజయాన్ని అందించడమే ముఖ్యం.15 ఏళ్లుగా అదే పని చేస్తున్నా. మీరు పరిస్థితులను ఎదుర్కోకుండా కామెంటరీ బాక్స్‌లో కూర్చొని మాట్లాడటం సరికాదు`` అని కోహ్లి కాస్త ఘూటుగా బదులిచ్చాడు. ఈ వ్యాఖ్యలపై తాజగా సునీల్ గవాస్కర్ స్పందించాడు. తమకేమీ అజెండాలు ఉండవని, ఏం చూస్తున్నామో దాని గురించే మాట్లాడతామని, ఎవరినీ అనవసరంగా విమర్శించబోమని చెప్పాడు.


``మీ అంత కాకపోయినా.. మేం కూడా కొంత క్రికెట్ ఆడాం. ఆట గురించి మాకు కూడా జ్ఞానం ఉంది. మాకు ఒకరంటే ఇష్టం.. మరొకరంటే ద్వేషం ఉండదు. మైదానంలో ఏం జరుగుతోందో దాని గురించే మాట్లాడతాం`` అని గవాస్కర్ బదులిచ్చాడు. గవాస్కర్ కామెంట్లపై కోహ్లీ ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. ముంబైకి చెందిన ఆటగాళ్ల గురించి తప్ప మరెవరి గురించి గవాస్కర్ పాజిటివ్‌గా మాట్లాడడని, ప్రతిసారి కోహ్లీని విమర్శిస్తూ వార్తల్లో ఉండేందుకు ప్రయత్నిస్తుంటాడని, గవాస్కర్ కంటే నెమ్మదిగా ఆడే ఆటగాడు ఇంకెక్కడా ఉండడని కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

MS Dhoni: ‘జట్టులో ధోనీ అవసరమా.. అతను చేసింది పెద్ద తప్పు’


IPL 2024: నేడు SRH vs MI మ్యాచ్ విన్ ప్రిడిక్షన్.. ప్రతీకారం తీర్చుకుంటారా?


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 06 , 2024 | 04:47 PM

Advertising
Advertising