ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Suryakumar Yadav: ఫైనల్ మ్యాచ్‌లో కాదు.. తన లైఫ్‌లో బెస్ట్ క్యాచ్ అదే అంటున్న సూర్యకుమార్ యాదవ్!

ABN, Publish Date - Jul 09 , 2024 | 12:23 PM

టీమిండియా స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ ఫైనల్ మ్యాచ్‌లో చివరి ఓవర్లో బౌండరీ లైన్ దగ్గర పట్టిన క్యాచ్‌ను అతడే కాదు.. అభిమానులు కూడా మర్చిపోలేరు. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ డేవిడ్ మిల్లర్ కొట్టిన బంతిని సూర్య అద్భుతమైన సమన్వయంతో పట్టుకున్నాడు.

Suryakumar Yadav

టీమిండియా స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ఫైనల్ మ్యాచ్‌లో చివరి ఓవర్లో బౌండరీ లైన్ దగ్గర పట్టిన క్యాచ్‌ను (Surya Catch) అతడే కాదు.. అభిమానులు కూడా మర్చిపోలేరు. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ డేవిడ్ మిల్లర్ (David Miller) కొట్టిన బంతిని సూర్య అద్భుతమైన సమన్వయంతో పట్టుకున్నాడు. లేకపోతే అది సిక్స్‌ వెళ్లడమే కాకుండా మ్యాచ్ దక్షిణాఫ్రికా వైపు టర్న్ అయిపోయేది. ఆ ఒక్క క్యాచ్‌తో మ్యాచ్‌ను సూర్య భారత్ వైపు తిప్పాడు. అది బెస్ట్ క్యాచ్ అంటూ దేశ ప్రధాని మోదీ కూడా సూర్యను ప్రశంసించారు (T20 Worldcup).


ఆ క్యాచ్ సూర్య కెరీర్‌లోనే కాదు భారత క్రికెట్ చరిత్రలో కూడా చిరస్థాయిగా నిలిచిపోతుంది. అయితే తన జీవితంలో బెస్ట్ క్యాచ్ మాత్రం మరొకటి ఉందని తాజాగా సూర్య పేర్కొన్నాడు. ఫైనల్ మ్యాచ్‌లో పట్టిన క్యాచ్ తనకు ముఖ్యమైనది కాదంటున్నాడు. తన భార్య దేవిశా షెట్టిన వివాహం చేసుకోవడమే తన జీవితంలోని బెస్ట్ క్యాచ్ అంటున్నాడు. తాజాగా సూర్య, దేవిశా ఎనిమిదో వెడ్డింగ్ యానివర్సరీ జరిగింది. వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఇద్దరూ కలిసి ఓ కేక్‌ను కట్ చేశారు. ఆ ఫొటోలను సూర్య ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.


``ఆ క్యాచ్ (డేవిడ్ మిల్లర్ క్యాచ్) పట్టి నిన్నటికి ఎనిమిది రోజులైంది. కానీ, నా జీవితంలో ముఖ్యమైన క్యాచ్ పట్టుకుని 8 సంవత్సరాలవుతోంది`` అంటూ సూర్యకుమార్ యాదవ్ కామెంట్ చేశాడు. ఈ పోస్ట్‌కు అభిమానుల నుంచి, క్రికెట్ ప్రేమికుల నుంచి స్పందన లభిస్తోంది. సూర్యకు విషెస్ చెబుతూ అభిమానులు కామెంట్ల వర్షం కురిపించారు.

ఇవి కూడా చదవండి..

ఫైనల్‌ బెర్త్‌ ఎవరిదో?


అతడితో ఐదేళ్లుగా మంధాన డేటింగ్‌!


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 09 , 2024 | 12:39 PM

Advertising
Advertising
<