Rohit Sharma: కోచ్, ఫ్రెండ్.. నా నమ్మకం నువ్వే..!!
ABN, Publish Date - Jul 09 , 2024 | 09:34 PM
టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ తప్పు కున్నారు. ఇన్ని రోజులు ద్రావిడ్‌తో కలిసి పనిచేసిన కెప్టెన్ రోహిత్ శర్మ ఉద్వేగానికి గురయ్యారు. సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్‌లో లేఖ రాశారు.
టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ తప్పు కున్నారు. ఇన్ని రోజులు ద్రావిడ్‌తో కలిసి పనిచేసిన కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఉద్వేగానికి గురయ్యారు. సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్‌లో లేఖ రాశారు. ప్రియమైన రాహుల్ భాయ్.. నేను మీకు రాసే లేఖలో సరైన పదాలు రాసేందుకు ప్రయత్నిస్తున్నా.. అంటూ ప్రారంభించారు.
రోహిత్ భావోద్వేగం
‘మిమ్మల్ని చిన్నప్పటి నుంచి చూసిన కోట్లాది మందిలో నేను ఒకడిని. మీతో కలిసి పనిచేసే అదృష్టం నాకు దక్కింది. ఆటలో మీరు ఉద్దండులు. మమ్మల్ని వదిలివెళుతున్నారు. విజయాలు, ప్రశంసలకు ఏ రోజు పొంగిపోలేదు. మేం మీతో ఏదైనా చెప్పగలిగే స్థాయికి చేరాం. ఆట తర్వాత కూడా మీ వినయం, ప్రేమ, మాకు లభించిన గొప్ప బహుమతి. మీలో నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. మీతో గడిపిన ప్రతి క్షణం విలువైంది. మిమ్మల్ని నా భార్య వర్క్ వైఫ్ అంటుంది. అలా పిలువడం నా అదృష్టంగా భావిస్తున్నా అని’ రోహిత్ శర్మ ఎమోషనల్ అయ్యారు.
రోహిత్- ద్రావిడ్
ద్రావిడ్ కోచ్‌గా, రోహిత్ భారత కెప్టెన్‌గా టీ 20 వరల్డ్ కప్ గెలిచిన సంగతి తెలిసిందే. అంతకుముందు వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడంతో యావత్ దేశం బాధ పడింది. తర్వాత కసితో టీ 20 కప్పు కొట్టారు. షెడ్యూల్ ప్రకారం ద్రావిడ్ కోచ్ పదవి నుంచి తప్పు కున్నారు. కప్పు కొట్టి ద్రావిడ్‌కు గిప్ట్ ఇస్తామని చెప్పి, విజయం సాధించారు.
ఇవి కూడా చదవండి..
Suryakumar Yadav: ఫైనల్ మ్యాచ్‌లో కాదు.. తన లైఫ్‌లో బెస్ట్ క్యాచ్ అదే అంటున్న సూర్యకుమార్ యాదవ్!
Team India Prize money: టీమిండియాకు రూ.125 కోట్ల ప్రైజ్‌మనీ.. ఎవరెవరికి ఎంతెంతంటే..!
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jul 09 , 2024 | 09:34 PM