ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

IND vs NZ: టీమిండియాకు షాక్.. సచిన్ రికార్డును సమం చేసిన రోహిత్

ABN, Publish Date - Oct 24 , 2024 | 05:42 PM

టీమిండియా కెప్టెన్ మరోసారి అభిమానులను నిరాశపరిచాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధికంగా డకౌట్ అయిన భారత ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ ముందు వరుసలో ఉన్నాడు.

Rohit Sharma

పూణె: న్యూజిలాండ్ తో టీమిండియా రెండో టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి టీమిండియా వికెట్ నష్టానికి 16 పరుగులుచేసింది. అయితే, మొదట టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్.. మొదటి ఇన్నింగ్స్‌లో 259 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. అనంతరం ఫస్ట్ ఇన్నింగ్స్‌ను ఆరంభించిన భారత్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్‌ శర్మ (0) డకౌట్‌గా వెనుదిరిగి నిరాశపర్చాడు. టిమ్‌ సౌథీ బౌలింగ్‌లో రోహిత్‌ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు ఒక పరుగు మాత్రమే. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమ్‌ఇండియా 16/1 స్కోరుతో ఉంది. శుభ్‌మన్ గిల్ (6 బ్యాటింగ్‌ ), యశస్వి జైస్వాల్ (10 బ్యాటింగ్‌) నాటౌట్‌గా క్రీజులో ఉన్నారు. భారత్ ఇంకా 243 పరుగుల వెనుకంజలో ఉంది.


రోహిత్ చెత్త రికార్డు..

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధికంగా డకౌట్ అయిన భారత ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ ఇప్పుడు ఆరో స్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు సచిన్ టెండూల్కర్ 34 డకౌట్‌ల రికార్డును రోహిత్ శర్మ సమం చేశాడు. అనిల్ కుంబ్లే 35 సార్లు, హర్భజన్ 37 సార్లు, విరాట్ కోహ్లీ 38 సార్లు, ఇషాంత్ శర్మ 40 సార్లు, జకీర్ ఖాన్ 43 సార్లు డకౌట్ అయ్యారు. అంతే కాదు అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్ శర్మను టిమ్ సౌథీ 14 సార్లు అవుట్ చేశాడు.

IND vs NZ: సుందర్ స్టన్నింగ్ డెలివరీ.. రచిన్ ఎక్స్‌ప్రెషన్ వైరల్(వీడియో)

Updated Date - Oct 24 , 2024 | 05:43 PM