Irigesi Arjun : అర్జున్‌కు వీసా కష్టాలు
ABN, Publish Date - Dec 21 , 2024 | 03:59 AM
తెలుగు గ్రాండ్‌మాస్టర్ ఇరిగేసి అర్జున్ వీసా సమస్యలు ఎదుర్కొంటున్నాడు. న్యూయార్క్‌లో వారం రోజుల్లో ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చాంపియన్‌షి్‌ప పోటీలు జరగనున్నాయి. అయితే,
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): తెలుగు గ్రాండ్‌మాస్టర్ ఇరిగేసి అర్జున్ వీసా సమస్యలు ఎదుర్కొంటున్నాడు. న్యూయార్క్‌లో వారం రోజుల్లో ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చాంపియన్‌షి్‌ప పోటీలు జరగనున్నాయి. అయితే, తనకు ఇప్పటివరకు వీసా రాలేదని అర్జున్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. గతవారం యూఎస్ ఎంబసీలో తన పాస్‌పోర్టును స్టాంపింగ్ కోసం ఇవ్వగా, ఇంతవరకు తిరిగి ఇవ్వలేదని ఆ పోస్ట్‌లో పేర్కొన్నాడు. పోటీలకు సమయం సమీపిస్తున్నందున తన వీసా సమస్యను సత్వరమే పరిష్కరించాలని కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జైశంకర్, క్రీడాశాఖ మంత్రి మాండవీయలను అర్జున్ కోరాడు. ఈనెల 26 నుంచి జరిగే ఈ మెగా టోర్నీలో వరల్డ్ నెంబర్‌వన్ కార్ల్‌సన్‌తో పాటు, కరువానా, నెపోమ్నియాచి లాంటి టాప్‌స్టార్లతో అర్జున్ తలపడనున్నాడు.
Updated Date - Dec 21 , 2024 | 03:59 AM