IPL 2025: ఐపీఎల్ 2025 మ్యాచ్‌ల సంఖ్యపై కీలక అప్‌డేట్
ABN, Publish Date - Sep 27 , 2024 | 09:41 AM
గత కొన్ని రోజులుగా కొత్త సీజన్ ఐపీఎల్ 205కు ముందు ఈసారి మ్యాచ్‌ల సంఖ్యను పెంచవచ్చనే దానిపై చాలా చర్చలు జరిగాయి. ఈ అంశంపై తాజాగా ఓ నివేదిక వెలుగులోకి వచ్చింది. అయితే ఈసారి మ్యాచ్‌ల సంఖ్యను పెంచుతారా లేదా అనే విషయాలను ఇక్కడ చుద్దాం.
ఐపీఎల్ 2025(IPL 2025) మెగా వేలానికి ముందు కొత్త సీజన్‌కు సంబంధించి ప్రతిరోజూ ఏదో ఒక అప్‌డేట్ వస్తూనే ఉంది. ఈ క్రమంలో ఇటీవల ఆటగాళ్ల రిటెన్షన్‌కు సంబంధించి అన్ని ఫ్రాంచైజీలు ఒక్కొక్కటి 5 మంది ఆటగాళ్లను ఉంచుకోవడానికి అనుమతించవచ్చని వెల్లడించింది. ఇప్పుడు కొత్త సీజన్‌లో ఎన్ని మ్యాచ్‌లు ఆడతారో కూడా అప్‌డేట్ వచ్చేసింది. గత కొన్ని రోజులుగా కొత్త సీజన్‌కు ముందు ఈసారి మ్యాచ్‌ల సంఖ్యను పెంచవచ్చనే దానిపై చాలా చర్చలు జరిగాయి. ESPN నివేదిక ప్రకారం ఐపీఎల్ మ్యాచ్‌ల సంఖ్య పెరిగే అవకాశం లేదని తెలుస్తోంది. ఆటగాళ్ల పనిభారం కారణంగా IPL 2025 కోసం 84 మ్యాచ్‌లకు బదులుగా 74 మ్యాచ్‌లను కొనసాగించాలని BCCI నిర్ణయించినట్లు తెలిసింది.
పనిభారం
2025 ఐపీఎల్లో 84 మ్యాచ్‌లు ఉండకపోవడానికి భారతీయ, అంతర్జాతీయ ఆటగాళ్లు పనిభారాన్ని తగ్గించడమే కారణమని తెలుస్తోంది. జూన్ 11 నుంచి లార్డ్స్‌లో జరగనున్న మూడో టెస్ట్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో టీమిండియా ప్రస్తుతం ఫేవరెట్‌గా ఉంది. ఈ క్రమంలో ఆటగాళ్లు అర్హత సాధిస్తే వారి సన్నద్ధతలో భాగంగా వారికి తగిన విశ్రాంతి ఉండేలా చూడాలని BCCI చూస్తోంది. ఐపీఎల్ 2025లో 84 మ్యాచ్‌లను నిర్వహించడంపై ఇంకా అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయా వర్గాలు తెలిపాయి. కానీ మ్యాచ్‌ల సంఖ్య పెరగడం వల్ల ఆటగాళ్లపై భారం పడుతుందని తాము భావిస్తున్నట్లు వెల్లడించారు.
పెంచుతారా
ఈ సీజన్ మొత్తం 74 మ్యాచ్‌లు (2023, 2024లో జరిగినట్లుగా) అంటే ప్రత్యేక ప్యాకేజీలో 18 మ్యాచ్‌లు ఉన్నాయి. ఒక సీజన్‌లో 74 కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఉంటే, ప్రత్యేక ప్యాకేజీ మ్యాచ్‌లు ప్రతి పది అదనపు మ్యాచ్‌లకు రెండు చొప్పున పెరుగుతాయి. కాబట్టి ఒక సీజన్‌లో 84 మ్యాచ్‌లు ఉంటే, ప్రత్యేక ప్యాకేజీ మ్యాచ్‌లు 20కి పెరుగుతాయని అంటున్నారు. ఆ క్రమంలో ఈ టోర్నమెంట్‌లో 94 గేమ్‌లు ఉంటే ప్రత్యేక ప్యాకేజీలో 22 మ్యాచ్‌లు ఉంటాయి. ఈ క్రమంలో మ్యాచ్‌ల సంఖ్యను 74 నుంచి 84కి పెంచుతారని అన్నారు. ఈ అంశంపై త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.
ఇవి కూడా చదవండి:
Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకు సెలవులు ఎన్నిరోజులంటే.. పనిచేసేది మాత్రం..
Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Read More Sports News and Latest Telugu News
Updated Date - Sep 27 , 2024 | 09:44 AM