Tournament : ఈశ్వరన్ శతకం
ABN, Publish Date - Sep 21 , 2024 | 03:41 AM
కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ (116) టోర్నీలో రెండో శతకంతో చెలరేగడంతో ఇండియా ‘డి’తో దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో ఇండియా ‘బి’ రెండోరోజు ఆఖరికి తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లకు 210 పరుగులు చేసింది.
ఇండియా ‘బి’ 210/6
ఇండియా ‘డి’తో దులీప్ ట్రోఫీ
అనంతపురం క్లాక్‌టవర్ (ఆంధ్రజ్యోతి): కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ (116) టోర్నీలో రెండో శతకంతో చెలరేగడంతో ఇండియా ‘డి’తో దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో ఇండియా ‘బి’ రెండోరోజు ఆఖరికి తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లకు 210 పరుగులు చేసింది. 100/5తో కష్టాల్లో పడగా..సుందర్ (39 బ్యాటింగ్) జతగా ఆరో వికెట్‌కు ఈశ్వరన్ 105 పరుగులు జోడించి పరిస్థితి చక్కదిద్దాడు. అంతకుముందు ఓవర్‌నైట్ 306/5 స్కోరుతో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇండియా ‘డి’ 349 రన్స్‌కు ఆలౌటైంది. కిందటి రోజు 89 పరుగులతో ఆడుతున్న సంజూ శాంసన్ సెంచరీ (106) పూర్తిచేశాడు. నవ్‌దీప్ సైనీ (5/74) ఐదు వికెట్లు పడగొట్టాడు.
ఇండియా ‘సి’ 216/7
అభిషేక్ పోరెల్ (82) సత్తా చాటడంతో ఇండియా ‘ఎ’తో మరో మ్యాచ్‌లో ఇండియా ‘సి’ తొలి ఇన్నింగ్స్‌లో శుక్రవారం ఆట చివరకు 216/7 స్కోరు చేసింది. 41/4తో ఇబ్బందుల్లో పడిన వేళ బాబా ఇంద్రజీత్ (34 రిటైర్డ్ హర్ట్) జతగా ఐదో వికెట్‌కు 51 రన్స్ జత చేసిన పోరెల్ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 224/7తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇండియా ‘ఎ’ 73 రన్స్ జోడించి మిగిలిన 3 వికెట్లు కోల్పోయింది. అవేశ్ ఖాన్ (51 నాటౌట్) హాఫ్ సెంచరీతో మెరిశాడు.
Updated Date - Sep 21 , 2024 | 03:41 AM