Gautam Gambhir: ఓవర్ త్రో పరుగు విషయంలో అసంతృప్తి.. మ్యాచ్ అంపైర్లతో గంభీర్ గొడవ!
ABN, Publish Date - Apr 27 , 2024 | 03:31 PM
సాధారణ సమయాల్లో కాస్త సహనంగా, ప్రశాంతంగా ఉండే టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ మ్యాచ్ విషయంలో మాత్రం చాలా భావోద్వేగంగా స్పందిస్తుంటాడు. టీమిండియా తరఫున ఆడే రోజుల్లో కూడా గంభీర్ మైదానంలో చాలా ఎమోషనల్‌గా ఉండేవాడు.
సాధారణ సమయాల్లో కాస్త సహనంగా, ప్రశాంతంగా ఉండే టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) మ్యాచ్ విషయంలో మాత్రం చాలా భావోద్వేగంగా స్పందిస్తుంటాడు. టీమిండియా తరఫున ఆడే రోజుల్లో కూడా గంభీర్ మైదానంలో చాలా ఎమోషనల్‌గా ఉండేవాడు. గతేడాది లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కు (LSG) మెంటార్‌గా ఉండే సమయంలో విరాట్ కోహ్లీతో గొడవ గురించి తెలిసిందే. ఇక, ప్రస్తుతం ఐపీఎల్ (IPL 2024)లో గంభీర్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు (KKR) మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు.
శుక్రవారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో పంజాబ్ కింగ్స్ లెవెన్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది (KKR vs LSG). టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 261 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కేకేఆర్ ఇన్నింగ్స్ 14వ ఓవర్ సందర్భంగా గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. ఆ ఓవర్ చివరి బంతిని క్రీజులో ఉన్న ఆండ్రూ రస్సెల్ కవర్స్ మీదుగా షాట్ కొట్టాడు. ఫీల్డర్ అశుతోష్ వర్మ ఆ బంతిని ఆపి వికెట్ కీపర్ వైపు విసిరాడు. అయితే అది ఓవర్ త్రో అయింది. దీంతో రస్సెల్ సింగిల్ తీశాడు.
పరుగు తీసినా దానిని పరిగణించేందుకు ఆన్ ఫీల్డ్ అంపైర్ నిరాకరించాడు. తాను ఓవర్ పూర్తయినట్టు కాల్ ఇచ్చాక అశుతోష్ బంతి విసిరాడని, అప్పుడు ఓవర్ త్రో అయినా ఆ పరుగు లెక్కలోకి రాదని అంపైర్ స్పష్టం చేశాడు. బ్యాటర్లు పెద్దగా అభ్యంతరం చెప్పకపోయినా డగౌట్‌లో కూర్చున్న గంభీర్ మాత్రం అసహనానికి గురయ్యాడు. సమీపంలో ఉన్న ఫోర్త్ అంపైర్ దగ్గరకు వెళ్లి అతడితో వాదనకు దిగాడు. అయితే ఫోర్త్ అంపైర్ కూడా ఆన్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్నే సమర్థించడంతో చేసేది లేక గంభీర్ కోపంగా వెనక్కి వెళ్లిపోయాడు.
ఇవి కూడా చదవండి..
IPL 2024: పంజాబ్ కింగ్స్ రికార్డు విక్టరీ..ప్రీతి జింటా హ్యాప్పీ, షారూఖ్ నిరాశ
Viral Video: SRH ఓటమి కావ్య మారన్ రియాక్షన్స్ వైరల్
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Apr 27 , 2024 | 03:31 PM