ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Virat Kohli: ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడు.. రెండో ఆసియన్.. రికార్డు సృష్టించిన కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్!

ABN, Publish Date - Jul 07 , 2024 | 03:04 PM

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ సాధారణమైనది కాదు. కేవలం భారత్‌లోనే కాదు.. క్రికెట్‌ను అభిమానించే అన్ని దేశాల్లోనూ కోహ్లీకి అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా కోహ్లీని ఎంతో మంది ఫాలో అవుతుంటారు. ఈ నేపథ్యంలో కోహ్లీ వారం క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ పోస్ట్ రికార్డులు సృష్టిస్తోంది.

Virat Kohli

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli)కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ సాధారణమైనది కాదు. కేవలం భారత్‌లోనే కాదు.. క్రికెట్‌ను అభిమానించే అన్ని దేశాల్లోనూ కోహ్లీకి అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా కోహ్లీని ఎంతో మంది ఫాలో అవుతుంటారు. ఈ నేపథ్యంలో కోహ్లీ వారం క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ పోస్ట్ (Instagram Post) రికార్డులు సృష్టిస్తోంది. టీమిండియా టీ20 ప్రపంచకప్‌ విజేతగా నిలిచిన తర్వాత రోహిత్ శర్మ ట్రోఫీ అందుకుంటున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.


``కలలో కూడా ఇంత కంటే గొప్ప రోజును చూడలేం. దేవుడు గొప్పవాడు. నా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. చివరకు మేం సాధించాం. జైహింద్`` అంటూ కోహ్లీ కామెంట్ చేశాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో రికార్డులు బద్దలుకొడుతోంది. వారం రోజుల్లో 2.09 కోట్ల లైక్స్ సాధించింది. ఈ నేపథ్యంలో పలు రికార్డులు బద్దలయ్యాయి.


కోహ్లీ ఇన్‌స్టా పోస్ట్ బద్దలుగొట్టిన రికార్డులు ఇవే..

1) ఓ భారతీయుడు చేసిన పోస్ట్‌కు 20 మిలియన్లకు పైగా లైక్‌లు రావడం ఇదే మొదటిసారి. ఇండియాకు సంబంధించినంతవరకు ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక లైక్‌లు పొందిన తొలి పోస్ట్‌గా ఇది నిలిచింది. ఇంతకుముందు కియారా ఆడ్వాణీ, సిద్ధార్థ్ మల్హోత్రా తమ వివాహ ప్రకటన గురించి చేసిన పొస్ట్‌ తొలి స్థానంలో ఉండేది.

2)ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కు 20 మిలియన్లకు పైగా లైక్‌లు అందుకున్న తొలి ఆసియన్ క్రీడాకారుడిగా కోహ్లీ నిలిచాడు.

3)ఓవరాల్‌గా చూసుకుంటే ఓ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కు 20 మిలియన్లకు పైగా లైక్‌లు అందుకున్న రెండో ఆసియా వాసిగా కోహ్లీ నిలిచాడు.

4)ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాకారులు చేసిన పోస్ట్‌ల్లో అత్యధిక లైక్‌లు అందుకున్న ఐదో పోస్ట్‌గా నిలిచింది.


ఇవి కూడా చదవండి..

Rishabh Pant: ఆ ఫోన్ కాల్ ఎంతో భరోసా నింపింది.. ప్రధాని మోదీ ముందు రిషభ్ పంత్ ఎమోషనల్!


Viral Video: ఎంఎస్ ధోని పాదాలకు మొక్కిన సాక్షి సింగ్


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 07 , 2024 | 03:04 PM

Advertising
Advertising
<