Virat Kohli: కోహ్లీకి ఘోర అవమానం.. ప్రాక్టీస్ చేస్తుండగా అలా గేలి చేయడంతో సీరియస్.. వీడియో వైరల్!
ABN, Publish Date - Jul 31 , 2024 | 06:45 PM
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ చేసేటపుడు చాలా మంది ``చోక్లీ`` అనే పదం వాడుతుంటారు. ఐసీసీ టోర్నీలలో నాకౌట్ మ్యాచ్‌లు ఆడేటపుడు కోహ్లీ విఫలమవుతాడనే ఉద్దేశంతో చాలా మంది కోహ్లీని అలా గేలి చేస్తుంటారు.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli)ని సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ చేసేటపుడు చాలా మంది ``చోక్లీ`` (Chokli) అనే పదం వాడుతుంటారు. ఐసీసీ టోర్నీలలో నాకౌట్ మ్యాచ్‌లు ఆడేటపుడు కోహ్లీ విఫలమవుతాడనే ఉద్దేశంతో చాలా మంది కోహ్లీని అలా గేలి చేస్తుంటారు. ``చోకింగ్`` (తడబడడం) అనే పదానికి కోహ్లీలోని చివరి అక్షరాన్ని కలిపి ``చోక్లీ`` అంటుంటారు. 2019 ప్రపంచ కప్ నుంచి టీమండియా నిష్క్రమించిన తర్వాత కోహ్లీని ఉద్దేశిస్తూ తొలిసారి ఈ పదాన్ని వాడారు. ఆ మ్యాచ్‌లో కోహ్లి 1 పరుగుకే ఔటయ్యాడు.
2015 ప్రపంచ కప్ సెమీఫైనల్‌లో కూడా కోహ్లీ ఒక్క పరుగే చేశాడు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌తో ఫైనల్ మ్యాచ్‌లో కూడా కోహ్లీ అలాగే ఔటయ్యాడు. దీంతో అతడిని గేలి చేసేటపుడు అభిమానులు ``చోక్లీ`` అని పిలుస్తుంటారు. గత నెల రోజులుగా ఇంగ్లండ్‌లో కుటుంబంతో కలిసి గడిపిన కోహ్లీ వన్డే సిరీస్ కోసం తాజాగా శ్రీలంక (SriLanka) వెళ్లాడు. ఓ ఇండోర్ స్టేడియంలో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఆ సమయంలో ఓ వ్యక్తి బయటి నుంచి ``చోక్లీ.. చోక్లీ`` అంటూ కోహ్లీని అవమానించాడు. షాకైన కోహ్లీ అతడి వైపు సీరియస్‌గా చూశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడి విజయానికి కారకుడైన కోహ్లీ ఆ తర్వాత టీ20 కెరీర్‌కు స్వస్తి పలికాడు. కేవలం వన్డేలు, టెస్ట్‌లు మాత్రమే ఆడబోతున్నాడు. ఈ నేపథ్యంలో శ్రీలంకతో వన్డే సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. గతేడాది నవంబర్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్ తర్వాత కోహ్లీ ఆడబోయే వన్డే మ్యాచ్ ఇదే కావడం గమనార్హం.
ఇవి కూడా చదవండి..
ICC Test Rankings: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో కోహ్లీని బీట్ చేసిన జైస్వాల్.. ఇక రోహిత్ శర్మ..
Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో అదరగొడుతున్న లక్ష్యసేన్..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jul 31 , 2024 | 06:45 PM