ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kohli vs Gambhir: విరాట్ అటువైపు చూస్తే ఏమవుతుందో.. బెంగళూరు, కోల్‌కతా మ్యాచ్‌పై ఆటగాళ్లు ఏమంటున్నారంటే..

ABN, Publish Date - Mar 29 , 2024 | 04:58 PM

ఈ రోజు మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్లు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ క్రేజీగా మారడానికి కారణం విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్. గత ఐపీఎల్‌లో వీరిద్దరూ మైదానంలో గొడవకు దిగిన సంగతి తెలిసిందే.

ఐపీఎల్‌లో (IPL 2024) కొన్ని జట్లు ఆడే మ్యాచ్‌లకు, ఇద్దరు వ్యక్తుల మధ్య పోరుకు మంచి క్రేజ్ ఉంటుంది. అలాంటి మ్యాచ్ ఈ రోజు (శుక్రవారం) జరగబోతోంది. ఈ రోజు మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్లు తలపడబోతున్నాయి (KKR vs RCB). ఈ మ్యాచ్ క్రేజీగా మారడానికి కారణం విరాట్ కోహ్లీ (Virat Kohli), గౌతమ్ గంభీర్ (Gautam Gambhir). గత ఐపీఎల్‌లో వీరిద్దరూ మైదానంలో గొడవకు దిగిన సంగతి తెలిసిందే. వీరిద్దరికీ అప్పట్లో బీసీసీఐ భారీ జరిమానా విధించింది (Kohli vs Gambhir).

ఆ సీజన్‌లో లఖ్‌నవూ జట్టుకు మెంటార్‌గా వ్యవహరించిన గౌతమ్ గంభీర్.. ఈ ఏడాది కోల్‌కతా జట్టుకు మార్గనిర్దేశనం చేయబోతున్నాడు. ఈ నేపథ్యంలో కోహ్లీ, గంభీర్ మరోసారి ఎదురుపడబోతున్నారు. ఇప్పటికే ఇరు జట్లూ ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. మైదానంలో గంభీర్, కోహ్లీ ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గంభీర్ ఎవరితోనో మాట్లాడుతుండగా.. కోహ్లీ అతడి వైపు తీక్షణంగా చూస్తున్నాడు. వీరిద్దరి గురించి మాజీ క్రికెటర్ వరుణ్ అరోణ్ మాట్లాడాడు.

``అప్పటి ఘటన గురించి మాట్లాడాలనుకోవడం లేదు. కానీ, ఈ రోజు మ్యాచ్‌లో ఏం జరుగుతుందో అనే ఆసక్తి మాత్రం ఉంది. మ్యాచ్ సమయంలో కోల్‌కతా డగౌట్‌లో కూర్చునే గంభీర్ బెంగళూరు ఫీల్డర్లకు దగ్గరగా ఉంటాడు. అటువైపు కోహ్లీ చూస్తే ఎలా ఉంటుందో చూడడానికి ఆసక్తికరంగా ఉంటుంది. వారిద్దరి మధ్య వైరం మైదానానికే పరిమితం అవుతుందని అనుకుంటున్నా`` అంటూ వరుణ్ కామెంట్ చేశాడు.

Updated Date - Mar 29 , 2024 | 04:58 PM

Advertising
Advertising