Virat Kohli: ఏంటీ చెత్త బౌలింగ్.. మైదానంలో కోహ్లీ ఎమోషనల్ మూమెంట్స్ చూశారా? వీడియో వైరల్!
ABN, Publish Date - Apr 16 , 2024 | 02:32 PM
ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, దినేష్ కార్తీక్.. వీరందరినీ మించి విరాట్ కోహ్లీ. ఇంత మంది స్టార్స్ ఉన్నా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పరిస్థితి దయనీయంగా ఉంది. ఈ సీజన్‌లో కప్పుపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ఇక ఆశలు వదిలేసుకోవాల్సిందే. ఇప్పటికి ఆడిన ఏడు మ్యాచ్‌ల్లోనూ ఆరింట్లో ఆర్సీబీ ఓడిపోయింది.
ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, దినేష్ కార్తీక్.. వీరందరినీ మించి విరాట్ కోహ్లీ (Virat Kohli). ఇంత మంది స్టార్స్ ఉన్నా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) పరిస్థితి దయనీయంగా ఉంది. ఈ సీజన్‌లో కప్పుపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ఇక ఆశలు వదిలేసుకోవాల్సిందే. ఇప్పటికి ఆడిన ఏడు మ్యాచ్‌ల్లోనూ ఆరింట్లో ఆర్సీబీ ఓడిపోయింది. ఆర్సీబీ వరుస పరాజయాలకు చెత్త బౌలింగ్ కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్సీబీ బౌలర్లపై అన్ని జట్ల బ్యాట్స్‌మెన్ సులభంగా ఎదురుదాడికి దిగుతున్నారు (IPL 2024).
తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో మ్యాచ్ జరిగింది (SRH vs RCB). ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. బౌండరీల వర్షం కురిపించి ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు నమోదు చేశారు చేశారు. 20 ఓవర్లలో ఏకంగా 288 పరుగులు చేసి రికార్డు సృష్టించింది. ఫెర్గూసన్, రీస్ టాప్లే, విజయ్ కుమార్, యశ్ దయాల్ అందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు.
హైదరాబాద్ బ్యాటర్లు పరుగుల వరద పారిస్తుంటే ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తీవ్ర అసహనానికి గురయ్యాడు. క్లాసెన్, హెడ్ బౌండరీల మోత మోగిస్తుంటే అలా చూస్తుండిపోయాడు. ఓ దశలో తీవ్ర ఆగ్రహానికి గురై కాలితో తంతూ, గాల్లోకి పంచ్‌లు విసురుతూ కోపాన్ని వెళ్లగక్కాడు. వికెట్లు పడినపుడు మాత్రమే కాస్త సంతోషంగా కనిపించాడు. హైదరాబాద్ ఇన్నింగ్స్ ఆసాంతం కోహ్లీ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ చూసి అతడి అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు.
ఇవి కూడా చదవండి..
Watch Video: క్లాసెన్ కొడితే అలాగే ఉంటుంది.. స్టేడియం అవతల పడిన బంతి.. కోహ్లీ రియాక్షన్ చూడండి..!
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Apr 16 , 2024 | 02:32 PM