ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Virat Kohli: ఆ ఫొటో కోసం రోహిత్‌ను కోహ్లీ ఎలా బతిమాలుతున్నాడో చూడండి.. వైరల్ అవుతున్న వీడియో!

ABN, Publish Date - Jul 12 , 2024 | 12:28 PM

అమెరికా-న్యూయార్క్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా విజేతగా నిలిచింది. దాదాపు 13 ఏళ్ల తర్వాత సాధించిన ఐసీసీ టోర్నీ కావడంతో అటు ఆటగాళ్లు, ఇటు క్రికెట్ అభిమానులు భావోద్వేగంలో మునిగిపోయారు. బార్బొడాస్‌లో టీమిండియా సాధించిన విజయానికి యావత్ భారతం ఉప్పొంగింది.

Rohit Sharma, Virat Kohli

అమెరికా-న్యూయార్క్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌ (T20 Worldcup) లో టీమిండియా విజేతగా నిలిచింది. దాదాపు 13 ఏళ్ల తర్వాత సాధించిన ఐసీసీ టోర్నీ కావడంతో అటు ఆటగాళ్లు, ఇటు క్రికెట్ అభిమానులు భావోద్వేగంలో మునిగిపోయారు. బార్బొడాస్‌లో టీమిండియా సాధించిన విజయానికి యావత్ భారతం ఉప్పొంగింది. కప్ పట్టుకుని వచ్చిన భారత ఆటగాళ్లకు ముంబై (Mumbai)లో అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఓపెన్ టాప్ బస్సులో వచ్చిన ఆటగాళ్లను చూసేందుకు సంద్రంలా పోటెత్తారు.


ఈ విన్నింగ్ పరేడ్‌లో ట్రోఫీ పట్టుకుని ఓపెన్ టాప్ బస్సుపై కోహ్లీ (Virat Kohli), రోహిత్ (Rohit Sharma) ఫొటోలకు ఇచ్చిన ఐకానిక్ ఫోజు చాలా మందిని ఆకట్టుకుంది. అలా ఫొటో తీసుకోవాలని ముందుగా కోహ్లీ భావించాడు. బస్సు వెనకాల కూర్చున్న రోహిత్‌ను బలవంతంగా ముందుకు తీసుకొచ్చి ట్రోఫీతో సహా ఫొటోకు ఫోజిచ్చాడు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది. సూర్యకుమార్ యాదవ్ రికార్డ్ చేసిన వీడియోను ముంబై ఇండియన్స్ ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.


ముందు నుంచి వచ్చిన కోహ్లీ తన సహచరుడు రోహిత్‌ను ఐకానిక్ చిత్రం కోసం ఎలా ఒప్పించాడో ఆ వీడియోలో కనిపిస్తోంది. కోహ్లీ బతిమాలడంతో రోహిత్ ముందుకు వచ్చి కోహ్లీతో కలిసి ఫొటోకు ఫోజిచ్చాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, ఈ టోర్నీతో కోహ్లీ, రోహిత్ తమ టీ20 కెరీర్లకు వీడ్కోలు పలికారు.

ఇవి కూడా చదవండి..

Pakistan: కోహ్లీ పాకిస్తాన్ వస్తే.. భారత్‌ను మర్చిపోతాడు.. పాక్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రీది ఆసక్తికర వ్యాఖ్యలు!


కోహ్లీనా.. అతడెవరు?


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 12 , 2024 | 12:28 PM

Advertising
Advertising
<