ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Watch Video: యువరాజ్ సింగ్ రికార్డు బద్దలు.. ఒకే ఓవర్లో 39 పరుగులు చేసిన బ్యాటర్

ABN, Publish Date - Aug 20 , 2024 | 11:48 AM

అంతర్జాతీయ క్రికెట్లో మరో సంచలనం నమోదైంది. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ సబ్ రీజినల్ ఈస్ట్ ఏషియా పసిఫిక్ క్వాలిఫయిర్ ఈవెంట్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో కనీ వినీ ఎరుగని రికార్డు నమోదైంది. టీమిండియా డాషింగ్ బ్యాటర్ యువరాజ్ సింగ్ 2007 ప్రపంచకప్‌లో నెలకొల్పిన రికార్డు బద్దలైంది.

uvraj Singh's 17-Year Old World Record Broken

అంతర్జాతీయ క్రికెట్లో మరో సంచలనం నమోదైంది. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ సబ్ రీజినల్ ఈస్ట్ ఏషియా పసిఫిక్ క్వాలిఫయిర్ ఈవెంట్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో కనీ వినీ ఎరుగని రికార్డు నమోదైంది. టీమిండియా డాషింగ్ బ్యాటర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) 2007 ప్రపంచకప్‌లో నెలకొల్పిన రికార్డు బద్దలైంది. ఒకే ఓవర్లో 39 పరుగులు చేసిన బ్యాటర్ సరికొత్త రికార్డు (Record) నెలకొల్పాడు. ఆ సంచలన ఓవర్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (39 Runs In One Over).


ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ సబ్ రీజినల్ ఈస్ట్ ఏషియా పసిఫిక్ క్వాలిఫయిర్ ఈవెంట్‌లో భాగంగా సమోవా, వనాటు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో సమోవా వికెట్ కీపర్ డారియస్ విస్సర్ (Darius Visser) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వనాటు బౌలర్ నిపికో వేసిన ఓవర్లో ఏకంగా 39 పరుగులు రాబట్టాడు. ఈ ఓవర్లో నిపికో మూడు నో బాల్స్‌తో సహా 9 బంతులు వేశాడు. ఈ 9 బంతుల్లో డారియస్ 6 సిక్స్‌లు కొట్టాడు. దీంతో ఈ ఓవర్లో మొత్తం 39 పరుగులు వచ్చాయి. దీంతో యువరాజ్ సింగ్ ఊచకోత రికార్డు బద్దలైంది. 2007 టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో యువీ ఆరు సిక్సర్లు బాది ఈ రికార్డు నెలకొల్పాడు.


అప్పటి నుంచి ఈ రికార్డు పదిలంగా ఉంది. ఆ తర్వాత యువరాజ్ రికార్డును కీరన్ పొలార్డ్ (2021), నికోలస్ పూరన్ (2024), దిపేందర్ సింగ్ (2024), రోహిత్ శర్మ-రింకూ సింగ్ (2024) సమం చేయగలిగారు. తాజాగా ఈ అరుదైన రికార్డును 28 ఏళ్ల డారియస్ విస్సర్ బ్రేక్ చేశాడు. ధనాధన్ బ్యాటింగ్ చేసిన విస్సర్ 62 బంతుల్లో 132 పరుగులు చేశాడు. కాగా, ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన సమోవా 2026 టీ20 వరల్డ్ కప్ అర్హత‌కు అవకాశాలను మెరుగుపర్చుకుంది.

ఇవి కూడా చదవండి..

Rohit sharma: రోహిత్ తీసుకున్న ఆ నిర్ణయం వల్లే టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా గెలిచింది: మాజీ బ్యాటింగ్ కోచ్


ఈసారి పతకాల సంఖ్య పెంచాలి


విరాట్‌, రోహిత్‌ ఎందుకు ఆడరు?


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 20 , 2024 | 11:48 AM

Advertising
Advertising
<