ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Shreyas Iyer: శ్రేయస్‌ను కోల్‌కతా ఎందుకు వదిలేసింది? ఆసక్తికర సమాధానం చెప్పిన కేకేఆర్ సీఈవో..

ABN, Publish Date - Nov 02 , 2024 | 04:21 PM

గడువు తేదీ సమీపించడంతో ఐపీఎల్ ఫ్రాంఛైజీలన్నీ తమ రిటెన్షన్ జాబితాను వెల్లడించాడు. వాటన్నింటిలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు తీసుకున్న నిర్ణయమే చాలా మందికి షాక్ కలిగించింది. గతేడాది ట్రోఫీ అందించిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను కోల్‌కతా టీమ్ వదిలేసుకుంది. ఇది చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది.

Shreyas Iyer

గడువు తేదీ సమీపించడంతో ఐపీఎల్ (IPL) ఫ్రాంఛైజీలన్నీ తమ రిటెన్షన్ జాబితాను (Retention List) వెల్లడించాయి. వాటన్నింటిలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టు తీసుకున్న నిర్ణయమే చాలా మందికి షాక్ కలిగించింది. గతేడాది ట్రోఫీ అందించిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ (Shreyas Iyer)ను కోల్‌కతా టీమ్ వదిలేసుకుంది. ఇది చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. కేకేఆర్ టీమ్ తగిన గౌరవం ఇవ్వకపోవడం వల్లే శ్రేయస్ బయటకు వచ్చాడని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ స్పందించారు. శ్రేయస్ అయ్యర్‌ను ఎందుకు రిటైన్ చేసుకోలేదో వివరించారు.


``మా జట్టు రిటెన్షన్ లిస్ట్‌లో శ్రేయస్ అయ్యర్ నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. అతడిని బయటకు వదలకూడదని మేం బలంగా నిర్ణయించుకున్నాం. అతడి చుట్టూనే మేం జట్టును నిర్మించుకున్నాం. అయితే రిటెన్షన్ అనేది ఇరువైపులా కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం. వేలానికి వెళ్లాలని శ్రేయస్ అనుకున్నాడు. అందుకే కేకేఆర్ రిటెన్షన్ లిస్ట్‌లో ఉండలేనని చెప్పాడు. అది అతడి నిర్ణయం. తన రియల్ వాల్యూ ఏంటో తెలుసుకోవాలని శ్రేయస్ అనుకుంటున్నాడ``ని వెంకీ తెలిపారు. శ్రేయస్ నిర్ణయాన్ని తమ జట్టు, మేనేజ్‌మెంట్ గౌరవించిందని, అందుకే అతడిని రిటైన్ చేసుకోలేకపోయామని వెంకీ తెలిపారు.


ప్రస్తుతం పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు కెప్టెన్ కోసం అన్వేషణ సాగిస్తున్నాయి. అయ్యర్‌ను దక్కించుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు వ్యూహాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆ మేరకు ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం నుంచి శ్రేయస్‌కు హామీ లభించినట్టు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో ఐపీఎల్-2025 కోసం మేగా వేలం జరగబోతోంది.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 02 , 2024 | 04:21 PM