ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

X Banned: ఒక్క నెలలో ఇండియాలోని 2 లక్షలకుపైగా ఎక్స్ ఖాతాలపై నిషేధం

ABN, Publish Date - Jun 17 , 2024 | 10:02 AM

ఎలాన్ మస్క్(Elon Musk) నేతృత్వంలోని మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ X కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో భారతదేశంలోని 2,30,892 ఎక్స్ ఖాతాలపై నిషేధం విధించింది. ఏప్రిల్ 26 నుంచి మే 25 మధ్య గుర్తించిన వాటిలో ఎక్కువ భాగం పిల్లలపై లైంగిక వేధింపులు, నగ్నత్వాన్ని ప్రోత్సహించే పోస్టులున్న ఖాతాలున్నట్లు పేర్కొన్నారు.

Elon Musk X accounts

ఎలాన్ మస్క్(Elon Musk) నేతృత్వంలోని మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ X కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో భారతదేశంలోని 2,30,892 ఎక్స్ ఖాతాలపై నిషేధం విధించింది. ఏప్రిల్ 26 నుంచి మే 25 మధ్య గుర్తించిన వాటిలో ఎక్కువ భాగం పిల్లలపై లైంగిక వేధింపులు, నగ్నత్వాన్ని ప్రోత్సహించే పోస్టులున్న ఖాతాలున్నట్లు పేర్కొన్నారు. దీంతోపాటు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న 1,303 ఖాతాలను కూడా తొలగించినట్లు వెల్లడించారు. X తన నెలవారీ నివేదికలో కొత్త IT రూల్స్ 2021కి అనుగుణంగా తన ఫిర్యాదుల పరిష్కార విధానం ద్వారా వాటిని తీసేసినట్లు తెలిపారు.


అదే సమయంలో భారతదేశంలోని వినియోగదారుల నుంచి 17,580 ఫిర్యాదులను స్వీకరించినట్లు నివేదించింది. ఇది కాకుండా సస్పెన్షన్‌కు(suspension) వ్యతిరేకంగా ఖాతాలు అప్పీల్ చేసిన 76 ఫిర్యాదులను కంపెనీ పరిష్కరించినట్లు ప్రకటించారు. ఈ క్రమంలో పలు ఫిర్యాదులను పరిష్కరించిన తర్వాత దేశంలో దాదాపు రెండు లక్షలకుపైగా ఖాతాలను నిషేధించారు. అయితే పరిస్థితి ప్రత్యేకతలను సమీక్షించిన తర్వాత తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఈ రిపోర్టింగ్ వ్యవధిలో పలు ఖాతాలకు సంబంధించిన 31 రకాల అభ్యర్థనలను(complaints) స్వీకరించినట్లు వెల్లడించారు. వాటిలో ఎక్కువగా ద్వేషపూరిత ప్రవర్తన (3,763), సున్నితమైన పెద్దల కంటెంట్ (3,205), దుర్వినియోగం/వేధింపు (2,815) గురించి ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు.


ఇది కూడా చదవండి:

Whatsapp: వాట్సాప్ నుంచి మరో ఫీచర్.. ఇకపై టైప్ చేయాల్సిన పనిలే..

Smart Phone: మీరు మీ స్మార్ట్‌ఫోన్‌పై ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు.. ఇలా తెలుసుకోండి

Read Latest Technology News and Telugu News

Updated Date - Jun 17 , 2024 | 10:07 AM

Advertising
Advertising